గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, ఫారిన్ ట్రిప్పుకు యంగ్ టైగర్ ప్లానింగ్

Published : Nov 02, 2025, 02:33 PM IST

షూటింగ్ లో గాయపడ్డ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొలుకున్నారు. మళ్లీ షూటింగ్ కు రెడీ అవుతున్నారు.. కాగా ఫారెన్ ట్రిప్పుకు తారక్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లబోతున్నాడు. 

PREV
15
సినిమా అంటే ఇష్టంతొ

సినిమా ఇండస్ట్రీలోకి వారసత్వంగా వస్తే సరిపోదు.. టాలెంట్ చూపిస్తేనే స్టార్లుగా మారుతారు అనడానికి బెస్ట్ ఉదాహరణ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇండస్ట్రీలో రాణించాలంటే సినిమా కోసం కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి అని నిరూపించారు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి ఫ్యామిలీ మూడవ తరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ డమ్ ను అందుకున్నాడు తారక్. యంగ్ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నారు.

25
బిజీ బిజీగా జూనియర్ ఎన్టీఆర్

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2 సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో ఆశించిన స్థాయి విజయాన్ని సాధించలేదు. బాలీవుడ్ ప్రేక్షకుల్లో కొంత వరకు గుర్తింపు దక్కినప్పటికీ, సినిమాకు అనుకున్న రేంజ్‌లో ఫలితం రాకపోవడంతో తారక్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తి ఫోకస్‌ను డ్రాగన్ సినిమాపైనే పెట్టాడు. ఇప్పటికే ఈసినిమాపై ఆడియన్స్ లో భారీగా అంచనాలు కూడా పెరిగిపోయాయి.

35
ఎన్టీఆర్ లుక్ పై కామెంట్స్

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్ పై మాస్ ఆడియన్స్ లో ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. బి, సీ సెంటర్ లో ఈసినిమా ఎక్కువగా హైప్ సృష్టించింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడ్డాడు.. విపరీతంగా వెయిట్ లాస్ అయ్యి.. కొత్త లుక్‌తో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు తారక్ ఎప్పుడూ లేనంత స్లిమ్‌గా, ఫిట్‌గా మారి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ లుక్ చూసిన ఫ్యాన్స్.. మా హీరోకు ఏమైంది.. ఎందుకు ఇలా తయారయ్యాడు అని కొంత నిరాశ వ్యక్తం చేశారు.

45
గాయల నుంచి కోలుకున్న

ఎన్టీఆర్ సరికొత్త లుక్‌ ప్రశాంత్ నీల్ మాత్రం ప్లానింగ్ లో భాగంగా చేసిందే.. తారక్ డిఫరెంట్‌గా కనిపించేలా ప్రశాంత్ ప్లాన్ చేశాడు.. స్క్రీన్‌పై ఎన్టీఆర్ మరోసారి తన సత్తా చూపించుకోబోతున్నాడు. త్వరగా సినిమాను కంప్లీట్ చేయాలని..షూటింగ్ ను సూపర్ ఫాస్ట్ గా కొనసాగిస్తున్న క్రమంలో.. ఎన్టీఆర్ గాయాలపాలు అయ్యాడు. కొన్ని రోజులు ఎన్టీఆర్ షూటింగ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న ఆయన మళ్లీ షూటింగ్‌ రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈసినిమా లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు టీమ్.

55
ఫారెన్ షెడ్యూల్ కు ఎన్టీఆర్

ఇక ‘డ్రాగన్’ మూవీ తదుపరి షెడ్యూల్ నవంబర్ మూడవ వారం నుంచి యూరప్‌లో జరగనుంది. గాయాల నుంచి కోలుకున్న ఎన్టీఆర్.. ఈ షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు. ఫారెన్ షెడ్యూల్ కోసం త్వరలో ప్లైట్ ఎక్కబోతున్నాడు ఎన్టీఆర్. ఈలోపు ఆయన ఫ్యామిలీతో ముందుగా ఫారెన్ వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. భారీ బడ్జెట్, అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందుతొన్నఈ సినిమా.. ఎన్టీఆర్ కెరీర్‌లో మరో లాండ్ మార్క్ మూవీగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

Read more Photos on
click me!

Recommended Stories