పసిగట్టేశాడు..ప్రభాస్ 'కల్కి' ట్రైలర్ పై కాపీ ఆరోపణలు, ఆధారాలతో సహా చూపిస్తూ రచ్చ

First Published Jun 13, 2024, 6:22 PM IST

జూన్ 27న రిలీజ్ కాబోతున్న ప్రభాస్ కల్కి 2898 AD మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇటీవల విడుదలైన కల్కి ట్రైలర్ హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో మైండ్ బ్లాక్ చేసింది. అంతా ఊహించినట్లుగానే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎవరిని డిజప్పాయింట్ చేయలేదు. 

జూన్ 27న రిలీజ్ కాబోతున్న ప్రభాస్ కల్కి 2898 AD మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇటీవల విడుదలైన కల్కి ట్రైలర్ హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో మైండ్ బ్లాక్ చేసింది. అంతా ఊహించినట్లుగానే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎవరిని డిజప్పాయింట్ చేయలేదు. నాగ్ అశ్విన్, ప్రభాస్ అండ్ టీం ఈ చిత్రాన్ని ఎంతలా ప్రాణం పెట్టి చేశారో ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. 

అయితే కథ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి చూపే వారికి ట్రైలర్ ఒక ఫజిల్ లా మారింది. దీనితో ట్రైలర్ రిలీజ్ అయ్యాక కథ గురించి ఎవరి థియరీలు వాళ్ళు చెప్పేస్తున్నారు. అయితే కల్కి చిత్రానికి కూడా కాపీ మరకలు అంటాయి. మంచి కాన్సెప్ట్ ఆర్టిస్ట్ గా పేరుగాంచిన సంగ్ చోయి కల్కి చిత్రంపై కాపీ ఆరోపణలతో ముందుకు వచ్చారు. 

Also Read: సిల్క్ స్మిత దగ్గర పనిచేసి..స్టార్ డైరెక్టర్ అయ్యాక ఆమె ముందే సిగరెట్ కాల్చుతూ, కారు ఆపి ఏం చేసిందంటే

Latest Videos


సంగ్ చోయి మర్వెల్ స్టూడియోస్, డిస్ని, వార్నర్ బ్రదర్స్ లాంటి సంస్థలలో పనిచేశారు. ఆయన డిజైన్ చేసిన ఒక కాన్సెప్ట్ ని కల్కి కల్కి ట్రైలర్ లో కాపీ కొట్టారు అంటూ ఆరోపిస్తున్నారు. జస్ట్ ఆరోపణలు మాత్రమే కాదు.. ఆధారాలతో సహా ముందుకు వచ్చారు. 

Also Read: వేణు స్వామిని వదిలిపెట్టని హీరోయిన్లు.. అబద్దాలు చెప్పి పరువు పోయినా వెంటపడుతున్నారుగా..

కల్కి ట్రైలర్ ప్రారంభం అయిన మొదటి సెకండ్ లోనే ఒక ఎడారి ప్రాంతంలో భారీ వస్తువు కనిపిస్తుంది. ఒక మెషీన్ ఆకారంలా అది ఉంటుంది. అదేంటనేది సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. అదే ఆకారాన్ని తాను పదేళ్ల క్రితమే డిజైన్ చేసి పోస్ట్ చేసినట్లు సంగ్ చోయి ఆరోపిస్తున్నారు. పదేళ్ల క్రితమే పోస్ట్ చేసిన వీడియో కూడా చూపిస్తున్నారు. 

Also Read: బిగ్ బాస్ 8 హోస్ట్ గా నాగార్జున డ్రాప్ అయితే.. ఆ సత్తా ఉన్న హీరోలు ఎవరెవరు ?

తన అనుమతి లేకుండా కల్కి టీమ్ కాపీ చేశారని.. ఇన్ని న్యాయబద్దంగా కరెక్ట్ కాదని హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఆరోపిస్తున్నారు. ఆయన షేర్ చేసిన ఆర్ట్ వర్క్, కల్కి ట్రైలర్ బిగినింగ్ లో కనిపించే ఆర్ట్ చాలా సిమిలర్ గా ఉన్నాయి. 

Also Read: చంద్రబాబు ప్రమాణస్వీకారం..ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం వాళ్ళిద్దరేనా, అందుకే డైరెక్ట్ గా హైదరాబాద్ లో..?

 అంతే కాకుండా ట్రైలర్ లో డూన్, మాడ్ మాక్స్, హాలో లాంటి హాలీవుడ్ చిత్రాల ఛాయలు కనిపిస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు. మొత్తంగా కల్కి ట్రైలర్ లో కూడా కాపీ అంశాలు ఉన్నట్లు పసిగట్టేశారు. 

అయితే ఇలాంటి చిన్న చిన్న ఆరోపణలు.. పోలికలు సహజంగానే వస్తుంటాయి. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే సంగ్ చోయి ఎలా స్పందిస్తారో చూడాలి. కల్కి చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్స్ ప్లానింగ్ లో బిజీగా ఉన్నారు. 

click me!