నన్ను క్షమించండి... తొలిసారి తలవంచిన అనసూయ, అసలు ఏం జరిగింది?

First Published Jun 13, 2024, 5:00 PM IST

యాంకర్ అనసూయ క్షమాపణలు చెప్పింది. అసలు ఎవ్వరికీ తలవంచని, లెక్క చేయని అనసూయ క్షమాపణలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కారణం ఏమిటో చూద్దాం.. 
 

Anasuya Bharadwaj

అనసూయ భరద్వాజ్ ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. తాను ఏం చేసినా కరెక్ట్ అని నమ్ముతుంది. ఒకరి కోసం నేను జీవించను అంటుంది. ఎవరేమనుకుంటారో అని తన  ఇష్టాయిష్టాలు మార్చుకునే రకం కాదు. 

anasuya insta pics

జబర్దస్త్ వేదికగా ఆమె చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు బుల్లితెరకు గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్. జబర్దస్త్ షోలో అనసూయ ధరించే దుస్తులు విమర్శలపాలయ్యాయి. కుటుంబ ప్రేక్షకులు చూసే షోలలో ఆమె పొట్టి బట్టలు ధరించడం పై సాంప్రదాయవాదులు మండి పడ్డారు. 

Anasuya Bharadwaj

ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ తగ్గింది లేదు. నేను ఎలాంటి బట్టలు ధరించాలో డిసైడ్ చేయడానికి మీరెవరు అని ఆమె ఎదురు దాడికి దిగింది. నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి బట్టలైనా ధరిస్తా అంటుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె విపరీతంగా ట్రోల్స్ కి గురవుతుంది. 

సోషల్ మీడియా ట్రోల్స్ పై ఆమె స్పందిస్తూ ఉంటారు. మితిమీరి కామెంట్స్ చేస్తే వెంటనే కౌంటర్స్ ఇస్తుంది. ఇంకా హద్దులు దాటితే సైబర్ క్రైమ్ లో కేసు పెడుతుంది. అనసూయ దెబ్బకు జైలు పాలైన ఆకతాయిలు చాలా మంది ఉన్నారు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్స్ పెట్టడం మానదు. 

photo credit-anasuya insta

పైగా తన హేటర్స్ ని రెచ్చగొట్టేలా పోస్ట్స్ పెడుతుంది. కామెంట్స్ చేస్తుంది. అయితే మొదటిసారి అనసూయ క్షమాపణ చెప్పింది. అందుకు కారణం ఏమిటంటే... అనసూయ సోషల్ మీడియాకు షార్ట్ బ్రేక్ ఇచ్చిందట. పని ఒత్తిడి కారణంగా పోస్ట్స్ పెట్టలేదట. అందుకు గాను ఫాలోవర్స్ తనను క్షమించాలని ఓ పోస్ట్ పెట్టింది. 

కాబట్టి... అనసూయ చేసిన తప్పు సోషల్ మీడియాకు కాస్త దూరం కావడం. అందుకు నిరాశ చెందిన ఫ్యాన్స్ తనను క్షమించాలని ఆమె కోరుకున్నారు. అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ వైరల్ అవుతుంది. నటిగా అనసూయ ఫుల్ బిజీగా ఉంది. ఆమె యాంకర్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. 

Latest Videos

click me!