Jr NTR: జూ.ఎన్టీఆర్ పై చేతబడి చేశారా ? అందుకే ఆ కమెడియన్ ని దూరం పెట్టిన తారక్.. ఓపెన్ గా చెప్పేశాడు

Published : Jan 01, 2026, 01:44 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఒక దశలో చేతబడి జరిగినట్లు రూమర్స్ వచ్చాయి. ఆ సంఘటన తర్వాత తారక్ తన స్నేహితుల్లో ఒకరైన ఓ కమెడియన్ ని దూరం పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
16
పాన్ ఇండియా హీరోగా జూనియర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో తారక్ కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. దేవర చిత్రంతో అది కొనసాగింది. ఈసారి ఇంకా భారీగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో తారక్ నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ రాజకీయ పరమైన వార్తలు కూడా వస్తుంటాయి. 

26
రాజకీయాలతో వార్తల్లోకి, కారు యాక్సిడెంట్ 

గతంలో తారక్ తెలుగు దేశం పార్టీ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో ప్రచారం చేశారు. ఖమ్మంలో మీటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా తారక్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తారక్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స అనంతరం ఎన్టీఆర్ కోలుకున్నారు. ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ కావడంతో అప్పట్లో అభిమానులు తీవ్ర ఆందోళనకి గురయ్యారు.  ఈ ప్రమాదంపై అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు వినిపించాయి. ఎన్టీఆర్ తో పాటు ఆ కారులో ఉన్నవారంతా డ్రింకింగ్ చేశారని , అందువల్లే యాక్సిడెంట్ అయినట్లు ప్రచారం జరిగింది. మరికొన్ని పుకార్ల ప్రకారం.. తారక్ పై చేతబడి జరిగినట్లు కూడా చెప్పుకున్నారు. ఈ రూమర్స్ పై జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. 

36
జూనియర్ ఎన్టీఆర్ పై చేతబడి 

పక్కన వాళ్ళ గురించి మాట్లాడేవారికి ఇంకో పని ఉండదు. వాళ్ళు అలాగే మాట్లాడతారు. కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకోరు. నేను తాగి కారు ఎక్కాను అని కొందరు అంటే మరికొందరు నాపై చేతబడి జరిగింది అని కూడా అన్నారు. అసలు అవేవీ నిజం కాదు. ఆ రోజు అందరం హ్యాపీగా భోజనం చేసి కారు ఎక్కాం. రెప్పపాటులో అంతా జరిగిపోయింది. ఆ ప్రమాదానికి ఎలాంటి కారణం లేదు, ఎవరి తప్పూ లేదు. 

46
ఎన్టీఆర్ తో రాజీవ్, శ్రీనివాస్ రెడ్డి

అది కంప్లీట్ గా మా చేతుల్లో లేకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది. నేను డ్రింకింగ్ చేసి ఉంటే నాకు డాక్టర్లు సర్జరీ ఎలా చేశారు అని తారక్ ప్రశ్నించారు. ఈ ప్రమాదం సమయంలో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి గురించి కూడా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కి ఉన్న స్నేహితుల్లో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఒకరు. ఎన్టీఆర్ కి చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్టీఆర్ కి తోడుగా ఉండేందుకు కొంత మంది స్నేహితులు వెళ్లేవారు. శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ కనకాల ఒకరోజు.. మరో రోజు వేరేవాళ్లు ఇలా వెళ్లేవారు. ఖమ్మంలో మీటింగ్ జరిగినప్పుడు రాజీవ్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

56
తారక్ కారులో నేను ఎక్కలేదు 

 ఈ ప్రమాదం తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. శ్రీనివాస్ రెడ్డిని దూరం పెట్టారట. దీని గురించి శ్రీనివాస్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఆ యాక్సిడెంట్ తర్వాత తారక్ కి నాకు మధ్య గ్యాప్ ఏర్పడిన మాట వాస్తవమే అని అన్నారు. దానికి కారణం ఎన్టీఆర్ కి పక్కన ఉన్న వ్యక్తులే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆ రోజు తిరుగుప్రయాణంలో తారక్ కారులో నేను కూడా ఎక్కాల్సింది. తారక్ రమ్మని పిలిచారు. నా బ్యాగ్ వెనుక కారులో ఉండడంతో తీసుకొద్దామని వెళ్ళా. ఈ లోపు తారక్ కారు స్టార్ట్ అయిపోయింది. దీనితో నేను వెనుక కారులో కూర్చున్నా. 20 సెకన్ల వ్యవధిలో తారక్ కారుకి యాక్సిడెంట్ అయింది. అసలు ప్రమాదం జరిగిన సౌండ్ కూడా రాలేదు. 

66
నా వల్లే యాక్సిడెంట్ అయింది అన్నారు 

కాస్త దూరంలో కారు నుజ్జు కనిపిస్తోంది. పక్కనే ఒక వ్యక్తి ఒళ్ళంతా డస్ట్ తో నిండిపోయి ఉన్నాడు. ఎవరని చూస్తే అది తారక్. వెంటనే కారులో ఎక్కించుకుని దగ్గర్లో సూర్య పేటలో మా అక్క ఉంటే ఆమెకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పా. ఆమె ఒక హాస్పిటల్ పేరు చెప్పారు. వెంటనే అక్కడికి తీసుకువెళ్లి ఎన్టీఆర్ కి ప్రథమ చికిత్స చేయించాం. అక్కడ ఎన్టీఆర్ కామన్ ఫ్రెండ్స్ లో ఒకరు.. శ్రీనివాస్ రెడ్డి రావడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని అన్నాడు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంత మాట అనేశాడు ఏంటి ? నా కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. తేరుకుని నేను రావడం వల్లే గాయాలతో తారక్ బయటపడ్డాడు. నేను రాకపోయి ఉంటే ఇంకెంత ప్రమాదం జరిగేదో అని కౌంటర్ ఇచ్చా. ఆ మాటలని తారక్ కి ఎవరో వేరే విధంగా చెప్పారు. అలా ఎన్టీఆర్ కి తనకి చిన్న గ్యాప్ వచ్చింది అని శ్రీనివాస్ రెడ్డి ఓపెన్ గా చెప్పారు. అయితే తారక్ తో ఏర్పడ్డ మనస్పర్థలు ఎక్కువ రోజులు ఉండవు అని.. తామిద్దరం మళ్ళీ సరదాగా కూర్చుని మాట్లాడుకుంటాం అని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories