నందమూరి నటసింహం బాలయ్య, విక్టరీ స్టార్ వెంకటేష్ ఒకే రకం కథతో రెండు సినిమాలు చేశారని మీకు తెలుసా? విచిత్రం ఏంటంటే.. ఒకే ఏడాది, ఒకటే డేట్ లో ఆ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంతకీ ఏంటా సినిమాలు?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ బరిలోకి దిగడం కామన్. టాలీవుడ్ లో కూడా చాలామంది హీరోలు ఇలా పోటీపడి గెలుపోటములు చూశారు. కానీ ఒకే రకం కథతో ఇద్దరు హీరోలు సినిమాలు చేయడం. ఆ సినిమాలు రెండు ఒకటే ఏడాది, ఒకే నెల.. ఒకే రోజు రిలీజ్ అవ్వడం మాత్రం.. తెలుగు పరిశ్రమ చరిత్రలో ఒక్కసారే జరిగింది. ఆ సినిమాలు చేసింది నందమూరి నటసిహం బాలయ్య.. విక్టరీ హీరో వెంకటే? ఈ రెండు సినిమాలలో ఏది హిట్ అయ్యింది? ఆ సినిమాల దర్శకులు ఎవరు?
24
ఒకే కథతో బాలయ్య, వెంకటేష్ సినిమా..
బాలయ్య, వెంకటేష్ ఇద్దరూ ఒకే కథతో సినిమాలు చేశారనే విషయం చాలా మందికి తెలియదు. బాలకృష్ణ హీరోగా నటించిన అశోక చక్రవర్తి సినిమా, వెంకటేష్ హీరోగా నటించిన ధ్రువ నక్షత్రం సినిమా కూడా 1989 జూన్ 29న విడుదలైంది.. ఈ రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్లలోకి రావడమే కాకుండా, కథకాస్త అటూ ఇటుగా ఒకటే కావడం విశేషం. ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే బాలకృష్ణ హీరోగా నటించిన అశోక చక్రవర్తి సినిమాకు ఎస్.ఎస్.రవి చంద్ర దర్శకత్వం వహించగా. వెంకటేష్ ధ్రువ నక్షత్రం సినిమాను వై. నాగేశ్వరరావు డైరెక్ట్ చేశారు.
34
ఇద్దరు హీరోలలో విజయం ఎవరిది..?
ఈ రెండు సినిమాల్లో వెంకటేష్ నటించిన ధ్రువ నక్షత్రం ప్రేక్షకాదరణ పొందుతూ విజయాన్ని సాధించింది. అయితే బాలయ్య నటించిన అశోక చక్రవర్తి సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అసలు ట్విస్ట్ ఏమిటంటే ఈ రెండు సినిమాలు మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఆర్యన్ సినిమా ఆధారంగా తెరకెక్కాయి. అశోక చక్రవర్తి సినిమా ఆర్యన్ కి అధికారిక రీమేక్ కాగా, ధ్రువ నక్షత్రం సినిమా ఫ్రీమేక్ గా రూపొందింది.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే..? ఈ రెండు సినిమాలకు స్టార్ రైటర్స్ అయిన పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. రెండు సినిమాల కథలు ఒకటేనని వారికి ముందే తెలిసినప్పటికీ, ఆ విషయాన్ని దర్శకులు, నిర్మాతలు పట్టించుకోలేదు అని సమాచారం. సినిమాలు విడుదలైన తర్వాత ఈ విషయం బయటకు రావడంతో నిర్మాతలు, దర్శకులు పరుచూరి బ్రదర్స్ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఒకే కథతో, ఒకే రోజున విడుదల కావడం వల్ల రెండు సినిమాలపై ప్రభావం పడింది. కలెక్షన్స్ విషయంలో కూడా ఈ రెండు సినిమాలు అనుకున్నంత రాబట్టలేకపోయాయి.