రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరి స్నేహం చాలా స్ట్రాంగ్.. అయితే రాజమౌళి పనిరాక్షసుడని అందరికి తెలుసు. ఈక్రమంలో రాజమౌళిపై రామ్ చరణ్ కు పీకలదాకా కోపం వచ్చిన సందర్భం గురించి మీకు తెలుసా?
రాజమౌళి తో చాలా క్లోజ్ గా ఉండే హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరు. ఒక రకంగా ఎన్టీఆర్, ప్రభాస్ తరువాత జక్కన్నకు రామ్ చరణ్ చాలా క్లోజ్.. ఈమధ్య కాలంలో ప్రభాస్ బాగా బిజీ అయిపోవడంతో.. ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి తో ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ తో మగధీర సినిమా చేసి జక్కన్న ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.. చాలా ఏళ్ల గ్యాప్ తరువాత.. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ సినిమా చేశాడు. ఈమధ్యలో వీరి స్నేహం మరింతగా స్ట్రాంగ్ అయ్యింది. రాజమౌళి కి మొదటి నుంచి ఎన్టీఆర్ తో బాండింగ్ ఎక్కువ.. ఇప్పుడు చరణ్ తో కూడా అదే స్నేహం రాజమౌళి కొనసాగిస్తున్నారు.
25
పనిరాక్షసుడు రాజమౌళి..
రాజమౌళి తో ఎంత స్నేహం ఉన్నా కానీ.. పని విషయంలో మాత్రం ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. తనకు కావల్సిన అవుట్ పుట్ వచ్చేవరకూ, ఎంత పెద్ద హీరో అయినా వదిలిపెట్టడు. గట్టిగా పిండి వారిలో కావల్సిన యాక్టింగ్ ను బయటకు తీస్తాడు జక్కన్న. రాజమౌళి మేకింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టే.. ఆయనకు జక్కన్న అనే పేరు వచ్చింది. ఈక్రమంలో స్టార్ డైరెక్టర్ తో క్లోజ్ గా ఉండే హీరోలు ఈ విషయంలో రాజమౌళి ని ఆటపట్టిస్తూనే చురకలు కూడా వేస్తుంటారు. ఎన్టీఆర్ అయితే ఛాన్స్ దొరికితే చాలు జక్కన్నను ఒక ఆట ఆడిస్తుంటాడు. చాలా ఇంటర్వూలలో.. రాజమౌళి పనితీరు గురించి ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క షాట్ కోసం 10 టేకుల పైనే తీసుకున్న పరిస్థితుల గురించి ఎన్టీఆర్, చరణ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
35
రాజమౌళిపై పీకలదాక కోపం వచ్చిన సందర్భం..
సినిమా ప్రమోషన్స్ ను రాజమౌళి టీమ్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తుంటారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ టైమ్ లో.. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ ముగ్గురు కలిసి సరదాగా సినిమా గురించి మాట్లాడుకుంటూ.. చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలు బాగా వైరల్ అయ్యాయి. అందులో భాగంగా ఓ సారి రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. '' నా మీద పీకలదాకా కోపం వచ్చిన సందర్భం ఏదైనా ఉందా అని అడిగాడు. '' ఆ ప్రశ్నకు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అన్నాడు. అందులో ఒకటి చెప్పు అని జక్కన్న అడిగితే.. నేను చెప్పాను అని ఎన్టీఆర్ ముఖం మీదే చెప్పేశాడు. కానీ రామ్ చరన్ మాత్రం ఓ సంఘటనను షేర్ చేసుకున్నాడు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''నాకు మాత్రం జక్కన్నపై పీకలదాకా కోపం వచ్చిన సందర్భం ఒకటి ఉంది. నేను ఫుల్ ఫీవర్ లో ఉన్నా కూడా ఒక సీన్ కోసం నన్ను వదిలిపెట్టలేదు. నేను రాలేను అని చెప్పినా సరే.. అక్కడ నీ కోసం 1000 మంది ఆర్టిస్ట్ లు వెయిటింగ్.. వారిని అలా వదిలేయలేము.. అని నాతో .. పనిచేయించాడు. ఆ పరిస్థితుల్లో కూడా నన్ను వదిలిపెట్టలేదు. నేను కార్తికేయతో చెప్పాను.. నా షార్ట్.. ఆ 1000 మంది షార్ట్ విడి విడిగా తీసుకోమని.. జక్కన్నపై అప్పుడు బాగా కోపం వచ్చింది. '' అని రామ్ చరణ్ అన్నారు.
55
ఒక్క స్టెప్ కోసం 17 టేకులు తీసుకున్న రాజమౌళి..
ఎన్టీఆర్, రాజమౌళి సరదాగా గొడవలు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. షూటింగ్ విషయంలో రాజమౌళి టార్చర్ ను అప్పుడప్పుడు కళ్లకు కట్టినట్టు వివరిస్తుంటాడు ఎన్టీఆర్. ఈక్రమంలోనే నాటు నాటు పాటలో ఒక చిన్న స్టెప్ కోసం 17 టేకులు తీసుకున్నాడట జక్కన్న. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ టైమ్ లో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా గుర్తు చేశారు. నాటు నాటు సాంగ్ లో ఇద్దరు కలిసి చేసే లెగ్ స్టెప్ కోసం 17 టేకులు తీసుకున్నారు రాజమౌళి. అన్ని టేకులు తీసుకున్నా కానీ.. చివరకు అన్నీ వదిలేసి రెండో టేక్ ను ఓకే చేశారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. రాజమౌళి గురించి తారక్ ఫన్నీ కామెంట్స్ చేశారు.