కమెడియన్ అలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది... లండన్ లో ఎంత పెద్ద కోటీశ్వరుడు అంటే!

Published : Dec 01, 2022, 06:57 AM ISTUpdated : Dec 01, 2022, 07:03 AM IST

 అలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ తెలిసిన జనాలు నోరెళ్లబెడుతున్నారు. అలీకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్దమ్మాయి ఫాతిమా వివాహం ఘనంగా జరిగింది.

PREV
16
కమెడియన్ అలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది... లండన్ లో ఎంత పెద్ద కోటీశ్వరుడు అంటే!
Ali Daughter Fathima Marriage


కోడలిని చిన్న ఇంటిని నుండి తెచ్చుకోవాలి. కూతురిని పెద్ద ఇంటికి కోడలిగా పంపాలని సామెత ఉంది. స్టార్ కమెడియన్ అలీ కూతురు విషయంలో ఇదే సూత్రం ఫాలో అయ్యాడు అంటున్నారు. తాజాగా కూతురు పెళ్లి చేసిన అలీ ఏరి కోరి లండన్ సంబంధం తెచ్చాడు. ఇక అలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ తెలిసిన జనాలు నోరెళ్లబెడుతున్నారు. అలీకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్దమ్మాయి ఫాతిమా వివాహం ఘనంగా జరిగింది. 
 

26
Ali Daughter Fathima Marriage


నవంబర్ 27  ఆదివారం హైదరాబాద్ లో పాతిమా వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. కూతురు పెళ్లిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అలీ సినీ, రాజకీయ పెద్దలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. హైదరాబాద్ లో వివాహం జరిగింది. అనంతరం సోమవారం గుంటూరులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలీ వైసీపీ పార్టీలో కొనసాగుతుండగా ఆయనను ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. 
 

36
Ali Daughter Fathima Marriage

కాగా అలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ తెలిసిన ఇండస్ట్రీ వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి. అలీ అల్లుడు పేరు షెహ్యాజ్. వృత్తిరీత్యా షెహ్యాజ్ డాక్టర్. జమీలా బాబీ, జిలాని భాయ్ దంపతుల కుమారుడే షెహ్యాజ్. వీరు గుంటూరు జిల్లాకు చెందినవారు. అయితే చాలా కాలం క్రితమే లండన్ లో స్థిరపడ్డారు. షెహ్యాజ్ కి ఒక బ్రదర్, సిస్టర్ ఉన్నారు. అన్నయ్య కూడా లండన్ లో డాక్టర్ అని తెలుస్తుంది. బాగా విద్యావంతుల ఫ్యామిలీ. 
 

46
Ali Daughter Marriage


ఇటీవల అలీ కూతురు ఫాతిమా డాక్టర్ పూర్తి చేశాడు. కూతురు కోసం అలీ డాక్టర్ సంబంధం తెచ్చాడు. ఇక లండన్ లో డాక్టర్ గా ఉన్న అలీ అల్లుడు షెహ్యాజ్ ఫ్యామిలీకి కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయట. చాలా కాలం క్రితం లండన్ లో స్థిరపడిన నేపథ్యంలో భారీగా ఆస్తులు కూడబెట్టారట. 
 

56
Ali Daughter Marriage

ఇక షెహ్యాజ్ ప్రముఖ డాక్టర్ గా కోట్ల సంపాదన కలిగి ఉన్నాడట. లండన్ లో సొంత ఇల్లు, ప్రాపర్టీస్ ఎలా గట్టిగా సెటిల్ అయ్యారట. ఇక బుద్ది, గుణగణాలు, ఫ్యామిలీ నేపథ్యం మంచిది కావడంతో అలీ ఈ సంబంధం కూతురికి సెట్ చేశాడట. అలీ కూతురు ఫాతిమా పెళ్లి విషయంలో పూర్తి సంతృప్తిగా ఉన్నారట. 
 

66
Ali Daughter Marriage

కట్నకానుకలు రూపంలో ఈయన కూడా భారీగానే ముట్టజెప్పాడట. పెళ్ళికి కోటి రూపాయల వరకూ ఖర్చు చేసిన అలీ... అల్లుడికి భారీగా గిఫ్ట్స్ ఇచ్చాడట. ఆలీకి కూడా కోట్ల ఆస్తులు ఉన్నాయి. నలబై ఏళ్లకు పైగా పరిశ్రమలో ఉన్న ఆయన చాలా ఆస్తులు కూడబెట్టాడు. హీరోగా, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వేయికి పైగా చిత్రాల్లో అలీ నటించారు.

click me!

Recommended Stories