బిగ్ బాస్ తెలుగు 9 సక్సెస్ ఫుల్‌గా మొదటివారం పూర్తి కావచ్చింది. ఈ రోజు శనివారంతో మొదటి వారం పూర్తి చేసుకుంటుంది. 15 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబర్ 7న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో ప్రారంభమైన విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా ఈ రియాలిటీ షో గ్రాండ్‌గా ప్రారంభమైంది. హౌజ్‌లోకి వచ్చిన 15 మంది కంటెస్టెంట్లలో 9 మంది సెలబ్రిటీలు భరణి, రీతూ చౌదరీ, తనూజ, ఇమ్మాన్యుయెల్, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, రాము రాథోడ్, ఫ్లోరా సైనీ, సంజనా గల్రానీ ఉండగా, ఆరుగురు కామనర్స్ దమ్ము శ్రీజ, డీమాన్ పవన్, పవన్ కళ్యాణ్, మర్యాద మనీష్, హరిత హరీష్, ప్రియా ఉన్నారు. అయితే హౌజ్‌లో కామనర్స్ ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారు. ఎత్తులపై ఎత్తులు వేస్తూ కూల్‌గా ఉంటున్నారు. కానీ సెలబ్రిటీలు మాత్రం హడావుడి చేస్తున్నారు. కంటెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.