Nagarjuna Birth Secret: నాగార్జున బర్త్ సీక్రెట్ రివిల్ చేసిన జగపతిబాబు, ఇప్పటివరకు నాగ్ కు కూడా తెలియని విషయం ఏంటీ?

Published : Sep 13, 2025, 08:14 AM IST

కింగ్ నాగార్జున ఎక్కడ పుట్టారో తెలుసా? ఇంట్లోనా? హాస్పిటల్ లోనా? ఆయన బర్త్ సర్టిఫికెట్ ను ఎప్పుడైనా చూశారా? నాగార్జునకు కూడా తెలియని ఆయన బర్త్ సీక్రెట్స్ ను రీసెంట్ గా జగపతి బాబు రివిల్ చేశారు? నాగార్జునకే షాక్ ఇచ్చారు. 

PREV
16
టాలీవుడ్ కింగ్ నాగార్జున

తెలుగు సినీపరిశ్రమకు ఎన్టీఆర్ ఏఎన్నార్ తరువాత నాలుగు పిల్లర్స్ గా నిలిచిన హీరోలలో నాగార్జున ఒకరు. అమ్మాయిల మనసు దోచిన మన్మధుడు, 66 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలు కుళ్లుకునే విధంగా ఫిల్ గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న ఈ హీరో, ఇప్పటికీ సినిమాలు, షోస్ తో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. గ్లమర్ , ఫిట్ నెస్ మాత్రమే కాదు టాలీవుడ్ లో రిచ్ హీరోగా కూడా ముందున్నారు. సినిమాలతో పాటు రకరకాల వ్యాపారాలు చేస్తూ.. కోట్లు గడిస్తున్న ఈ స్టార్ హీరో టాలీవుడ్ రియల్ కింగ్ గా మారిపోయాడు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోతో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు నాగార్జున.

26
బుల్లితెరపై సందడి.

రొమాంటిక్ హీరోగా టాలీవుడ్ వెండితెరను ఏలిన నాగార్జున, ఆతరువాత కాలంలో బుల్లితెరపై కూడా సత్తా చాటాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ లాంటి షోస్ తో నాగార్జున సరికొత్త ట్రెండ్ ను టాలీవుడ్ లో క్రియేట్ చేశాడు. నాగ్ ను చూసి మరికొంత మంది హీరోలు కూడా ఈ ట్రెండ్ ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఈక్రమంలో ఎన్టీఆర్, నాని, చిరంజీవి, బాలయ్య, రానా, తాజాగా జగపతి బాబు కూడా బుల్లితెరపైకి ఎంట్రీఇచ్చారు. ఒకప్పటి ఫ్యామిలీ హీరో జగపతి బాబు ప్రస్తుతం జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. ఈక్రమంలో హోస్ట్ గా సక్సెస్ అయిన నాగార్జున ఈ ప్రోగ్రామ్ కు ఫస్ట్ గెస్ట్ గా రావడం విశేషం. ఈ ఇద్దరు హీరోలు చేసిన సందడికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

36
నాగార్జున కు సర్ప్రైజ్ ఇచ్చిన జగపతి బాబు

సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలలో సర్ప్రైజ్ లు ఎక్కువగా ఉంటుంటాయి. అతిధులకు తెలియకుండా వారి సీక్రేట్స్ తో సర్ ప్రైజ్ చేస్తుంటారు. ఈక్రమంలో నాగార్జునకు కూడా ఇలాంటి సర్ ప్రైజ్ ఒకటి ఇచ్చారు జగపతి బాబు. నాగార్జున ఏ హాస్పిటల్ లో పట్టారు. ఎప్పుడు పుట్టారు, ఆయన బర్త్ సర్టిఫికెట్, దానికి సబంధించిన ఫోటోస్ , ఇలా ఫుల్ ప్యాక్ ట్విస్ట్ తో ఓ వీడియోను కింగ్ కు చూపించి షాక్ ఇచ్చాడు జగపతిబాబు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే నాగార్జున కూడా ఇవి ఎప్పుడూ చూడలేదట. ఆయనక కూడా తాను ఎక్కడ పుట్టిన విషయం తెలియదని రివర్స్ సర్ప్రైజ్ చేశాడు కింగ్.

46
నాగార్జున రియాక్షన్

జగపతిబాబు ఇచ్చిన సర్ప్రైజ్ కు నిజంగా షాక్ అయ్యాడు నాగార్జున. తనకే తెలియని బర్త్ సీక్రేట్ రివిల్ చేసిన జగపతి బాబు థ్యాంక్స్ చెప్పారు. నాగార్జున 1959 లో చెన్నైలోని సెయింట్ ఇసబెల్ల హాస్పిటల్ లో జన్మించారు. ఆయన బర్త్ సర్టిఫికెట్ లో ఈ వివరాలతో పాటు ఫోటో గ్రాఫ్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి. అయితే చిత్రం ఏంటంటే నిజంగా ఇసబెల్ హాస్పిటల్ పుట్టిన విషయం తనకు తెలియదని, ఇప్పటి వరకు ఆ బర్త్ సర్టిఫికెట్ కూడా తాను ఇంత వరకూ చూడలేదని, అది చూసే సందర్భం కూడా రాలేదని నాగార్జున ఆశ్చర్యపోయారు. ఇవన్నీ ఎక్కడ సంపాదించారంటూ జగపతిబాబును ప్రశ్నించారు. ఇలా నాగార్జున బర్త్ సీక్రేట్స్ ను రివిల్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు జగపతి బాబు. ఈ వీడియోను అక్కినేని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

56
విలన్ గా నాగార్జున కొత్త అవతారం.

కింగ్ నాగార్జున ఈమధ్య సినిమాలు తగ్గిచేశారు. బిగ్ బస్ హోస్ట్ గా బిజీగా ఉన్న ఆయన, వ్యాపారాలు చూసుకుంటున్నారు. హీరోగా చాలా తక్కువ సినిమాలు చేస్తూ వస్తోన్న ఆయన , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ముఖ్యంగా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ పై ఫోకస్ చేశారు. నెగెటీవ్ రోల్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు నాగ్. రీసెంట్ గా రజినీకాంత్ కూలీ సినిమాలో ఆయన చేసిన సైమన్ పాత్రకు అక్కడ భారీగా రెస్పాన్స్ వచ్చింది. దాంతో తమిళంలో నాగ్ కు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. అంతకు మందు ధనుష్ హీరోగా వచ్చిన కుబేర సినిమాలో కూడా నాగర్జున ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్ చేశారు. ఇక నాగార్జున ఇలా క్యారెక్టర్ రోల్స్ కు టర్న్ అవ్వడంతో హీరోగా సినిమాలు చేస్తారా లేదా అని అక్కినేని ఫ్యాన్స్ లో చిన్న ఆందోళన కనిపించింది. కాని ఆయన మల్టీపుల్ రోల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

66
నాగార్జున 100వ సినిమా

ఈక్రమంలోనే ఇప్పటి వరకూ 99 సినిమాలు చేసిన నాగ్ త్వరలో 100 సినిమాను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తమిళ దర్శకుడు కార్తీక్ తో నాగార్జున 100వ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. దీనికి సబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. తమిళంలో నాగార్జున ఇమేజ్ పెరగడంతో ఈసారి తన 100వ సినిమాను అక్కడ కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట నాగార్జున. ప్రస్తుతం ఆయన ఫోకస్ బిగ్ బాస్ ను సక్సెస్ పైనే ఉన్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories