Akshay Kumar Fitness Secret : 58 ఏళ్ల వయసులో 30 ఏళ్ల యంగ్ లుక్ , స్టార్ హీరో ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే?

Published : Sep 13, 2025, 09:33 AM IST

Akshay Kumar Fitness Secret: 58 ఏళ్ల వయస్సులో కూడా 30 ఏళ్ల యంగ్ లుక్ లో కలిపిస్తున్నాడు  ఓస్టార్ హీరో. ఈ ఏజ్ లో కూడా ఆయన అంత ఫిట్ గా ఉండటానికి కారణం ఏంటి? డైలీ ఆ స్టార్ హీరో పాటించే హెల్దీ లైఫ్ స్టైల్ గురించి ఇప్పుడు చూద్దాం. 

PREV
18
అక్షయ్ కుమార్ తన ఫిట్‌నెస్

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ 58 ఏళ్ల వయస్సులో కూడా తగ్గేదే లేదు అంటున్నారు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ఫిల్ నెస్ ను కాపాడుకుంటున్నారు. హెల్దీ లైఫ్ స్టైల్ తో  తన ఫిట్‌నెస్ పై చాలా శ్రద్ధ వహిస్తారు అక్షయ్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన  తన దినచర్యను మిస్ అవ్వరు. రోజులో 24 గంటల్లో కొంత సమయమైనా మన శరీరానికి ఇవ్వలేకపోతే, ఏం ప్రయోజనం అని అక్షయ్ అంటారు.

28
అంత తేలిగ్గా దొరకదు

జీవితంలో ఎలాంటి షార్ట్‌కట్‌లు లేవని అక్షయ్ చెబుతారు. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహార ప్రణాళిక, యోగా ద్వారా అక్షయ్ కుమార్ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నారు. షార్ట్ కట్ లో రావాలంటే విలువైనదేది వచ్చి మన చేతిలో పడదు అని ఆయన అంటుంటారు. 

38
అక్షయ్ కుమార్ లైఫ్ స్టైల్

అక్షయ్ ఉదయం 5 గంటలకు నిద్రలేస్తారు, సాయంత్రం 6.30కి భోజనం ముగించేస్తారు.  సాయంత్రలోపు  భోజనం  ముగించేయాలని,  అలా చేయడం వల్ల పడుకున్నప్పుడు మన శరీరంలోని అన్ని భాగాలు పనిచేస్తాయని ఆయన అన్నారు. 

48
ఏది పడితే అది తినకూడదు

అన్ని వ్యాధులు కడుపు నుండే ప్రారంభమవుతాయి, కాబట్టి దానిలో ఆహారాన్ని ఇష్టానుసారంగా నింపడం తప్పు అని అక్షయ్ కుమార్ అంటారు. మీరు సాధారణంగా  సరైన మోతాదులో సమయానికి తింటే, వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇష్టం వచ్చినట్టు తింటే అది శరీరానికి ముప్పు తీసుకువస్తుందని అక్షయ్ వెల్లడించారు. 

58
సోమవారం ఉపవాసం

అక్షయ్ కుమార్ సోమవారం ఉపవాసం ఉంటారు. ఆ తర్వాత మంగళవారం ఉదయం వరకు ఏమీ తినరు. దీనివల్ల, ఆయన శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు. ఇలా వారానికి ఒక రోజు ఉపవాసం చేయగలిగితే బాడీమెటబాలిజం పర్ఫెక్ట్ గా  పనిచేస్తుంది. 

68
డూప్ లేకుండా స్టంట్స్

బాలీవుడ్‌లోకి రాకముందే అక్షయ్ కుమార్ మార్షల్ ఆర్ట్స్‌లో నిష్ణాతులు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఫిట్‌గా ఉండే అలవాటు ఉంది. ఆయన ఇప్పటికీ తన స్టంట్‌లను స్వయంగా చేస్తారు. యాక్షన్ సీన్స్ కోసం, స్టంట్స్ కోసం డూప్ లను వాడటం అక్షయ్ కు అలవాటు లేదు. 

78
వెయిట్ లిఫ్టింగ్ చేయరు.

అక్షయ్ కుమార్ వెయిట్ లిఫ్టింగ్ చేయరు. ఆయన ఇతర వ్యాయామాలన్నీ చేస్తారు. ఈత, పరుగు, యోగా, స్పారింగ్ అన్నీ చేస్తారు. కాని అక్షయ్ ఎందుకు వెయిట్ లిఫ్టింగ్ చేయరు అన్నదానిపై స్పష్టత లేదు. 

88
చెడు అలవాట్లకు దూరం

అక్షయ్ కుమార్ మద్యం, సిగరెట్, లేట్ నైట్ పార్టీల వంటి అలవాట్లకు దూరంగా ఉంటారు. ఇది శరీరం తో పాటు మనస్సుపై ప్రభావం చూపుతుందని ఆయన నమ్మకం. అంతేకాకుండా, నటుడికి టీ, కాఫీ తాగే అలవాటు కూడా లేదు. ఇలా హెల్దీ లైఫ్ స్టైల్ తో అక్షయ్ కుమార్ తన ఫిట్ నెస్ ను కాపాడుకుంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories