మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆ హీరోయిన్ వల్ల డిజాస్టర్ అయ్యిందా..? ఎంత వరకూ నిజం..?

First Published | Jul 14, 2024, 9:21 AM IST

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదిగారు. వరుస హిట్లు.. వరుస ప్లాప్ లు ఇలా కష్టసుఖాలన్నీ చూశారు. విజయం ఎప్పుడూ వరించాలని లేదు.. పరాజయం ఎల్లకాలం ఉంటుందని కూడా లేదు. ఇలా హిట్లుప్లాప్ లు సబంధం లేకుండా.. అభిమానులను అలరించడమే లక్ష్యంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు మెగాస్టార్. 

సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ గా ఎధిగిన చిరంజీవి కెరీర్ లో హిట్లతో పాటు ప్లాప్ లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే అందులో కొన్ని మాత్రం తన తప్పిదం లేకుండా.. ఇతర కారణాల వల్ల ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కథ, దర్శకులు, మ్యూజిక్ ఇలాంటి ఎలిమెంట్స్  హిట్ ప్లాప్ లో భాగం అవుతుంటాయి. అయితే ఓ హీరోయిన్ వల్ల మెగాస్టార్  చిరంజీవి ప్లాప్ ను ఫేస్ చేయాల్సి వచ్చిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? 

శ్రీదేవికి మూడో కూతురు కూడా ఉందా..? ఎవరికీ తెలియని రహస్యం ఎలా బయటపడింది..?
 

ఇప్పుడంటే సినిమాను కలెక్షన్స్ బేస్ లో హిట్ చేస్తున్నారు కాని.. 20 ఏళ్ళ క్రితం సినిమా వందరోజులు ఆడితేనే అది హిట్.. అంతకు మించి ఆడితే అది బ్లాక్ బస్టర్ తో సమానం. ఇలా చిరంజీవి సినిమాలు ఎన్నో 100 డేస్ ఫంక్షన్ చేసుకున్నాయి. అప్పట్లో చిరంజీవి సినిమాకు మామూలు క్రేజ్ ఉండేదే కాదు. చిరు తెర‌మీద క‌నిపిస్తే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే. ఆయన మైఖైల్ జాక్సన్ స్టెప్ లు వేస్తుంటే.. ఊగిపోయేవారు అభిమానులు. 

మహేష్ బాబు మిస్సయ్యాడు..రామ్ పోతినేని బుక్కయ్యాడు.. భారీ డిజాస్టర్ నుంచి తప్పించుకున్న సూపర్ స్టార్..


ఈక్రమంలో చిరంజీవి వరుసగా హిట్ సినిమాలు చేస్తున్న టైమ్ లో చేసిన ఓ సినిమా రివర్స్ అయ్యింది.  ఆయన చేసిన  ప్ర‌యోగం బెడిసి కొట్టింది. ఒక హీరోయిన్ వ‌ల్ల ఆ సినిమా ప్లాప్ అయ్యిందంటే నమ్మడానికి వచిత్రంగా ఉంటుంది. అయితే అప్పటికీ.. ఇప్పటికీ.. అదే వాదన వినిపిస్తుంటుంది.

ఇంటర్ కూడా చదవని స్టార్ హీరోయిన్.. కోట్లు సంపాదిస్తోంది..? వందల కోట్లకు వారసురాలు ఎవరో తెలుసా..?

ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. శంకర్ దాదా జిండాబాద్. అవును ఈసినిమా ప్లాప్ కు కారణం హీరోయిన్ అని ముద్రపడిపోయింది. 

సౌందర్య 100 కోట్ల ఆస్తి.. ఎవరి సొంతం అయ్యింది..? వీలునామాలో హీరోయిన్ ఎవరి పేరు రాసింది..?

అసలు విషయానికి వస్తే.. సంజ‌య్‌ద‌త్ హిందీలో న‌టించి బ్లాక్ బస్టర్ హిట్  శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా  రీమేక్ చేశారు. జయంత్ డైరెక్ట్ చేసిన ఈసినిమా ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ సాధించింది. అయితే ఈసినిమాలో చిరంజీవి పెర్ఫామెన్స చించేశారు. హీరోయిజం, కామెడీ, సెంటిమెంట్, లవ్, యాక్షన్ ఇలా ఏవిషయంలో తగ్గకుండా నవరసాలు చూపించేశారు. చిరంజీవికి తోడు.. అదమైన ముద్దు గుమ్మ సోనాలిబింద్రే కూడా  ఈసినిమాకు ప్ల‌స్ అయ్యారు. ఆమె కళ్ళతోనే ఆడయిన్స్ ను పడేస్తారు. కళ్లలోనే అద్భుతమైన భావాలు చూపిస్తారు.

రజినీకాంత్ - కమల్ హాసన్ సంచలన నిర్ణయం, హీరో సిద్దార్ధ్ వల్ల బయటకు వచ్చిన నిజం..

అయితే శంకర్ దాదా కు సీక్వెల్ గా  శంక‌ర్‌దాదా జిందాబాద్ ను కూడా చేశారు చిరు. బాలీవుడ్ లో సంజయ్ దత్ చేసిన లగేరహే మున్నాభయ్ ను.. శంకర్ దాదా జిందాబాద్ గా తీశారు. అయితే ఈసినిమాకు  ప్ర‌భుదేవా డైరెక్ట‌ర్‌. ఈ సినిమా గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఘోర‌మైన డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఫ‌స్ట్ పార్ట్‌కు పెద్ద ప్లస్ పాయింట్ హీరోయిన్‌గా సోనాలి బింద్రే నిలిచింది.. కానీ, సీక్వెల్ లో మాత్రం కరిష్మా కొటక్ సినిమాకు మైనస్ అయ్యింది అంటారు. 

అంతే కాదు చిరంజీవి పక్కన ఆమె ఏమాత్రం సూట్ అవ్వలాదేని ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయ్యారు.  ఆమె ఏజ్ బార్ లా కనిపించిందని చాలా మంది అభిప్రాయం. అందుకే ఈసినిమా జనాలకు అస్సలు నచ్చలేదని అభిప్రాయం  వెల్లడి అయ్యింది. అంతే కాదు  ప్ర‌భుదేవా చెత్త డైరెక్ష‌న్‌తో పాటు హీరోయిన్ క‌రిష్మా కొట‌క్ కూడా శంక‌ర్‌దాదా సీక్వెల్ ఫ్లాప్ కి కారణం అన్న‌ టాక్ అప్ప‌ట్లో వినిపించింది. ఏది ఏమైనా ఈ న్యూస్ అప్పట్లో బాగా స్పెర్డ్ అయ్యింది. కాగా ప్రస్తుంతం మెగాస్టార్ చిరంజీవి మంచి ఊపు మీద ఉన్నారు. వశిష్ట డైరెక్షన్ లో ఆయన  విశ్వంభ‌ర సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈమూవీలో చాలా కాలం తరువాత త్రిష చిరుజోడీగా నటిస్తోంది. 

Latest Videos

click me!