ఈసినిమా టైమ్ లో సజల్ శ్రీదేవికి బిడ్డగా దగ్గరయ్యింది. మరణించిన తన తల్లిని శ్రీదేవిలో చూసుకునేది సజల్. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినసజల్ శ్రీదేవి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. తన తల్లి మరణించాక.. శ్రీదేవిలో అమ్మను చూసుకున్నాను. కాని దేవుడు ఈ అమ్మను కూడా దూరం చేశాడు అంటూ బాధపడింది. “సజల్ నాకు మూడో సంతానం లాంటిది. "ఇప్పుడు నాకు మరో కూతురు ఉన్నట్లు అనిపిస్తుంది అని శ్రీదేవి అనేవారని సజల్ గుర్తు చేసింది.