బాలకృష్ణ కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన `నరసింహనాయుడు` సినిమాతో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ పోటీ పడ్డారు. బాలయ్య సినిమా దెబ్బకి వీరి సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి.
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ పరంగా పీక్‌లో ఉన్నారు. ఆయన బ్యాక్ టూ బ్యాక్ నాలుగు విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా `అఖండ 2`తో రాబోతున్నారు. ఈ సాయంత్రం నుంచే ప్రీమియర్స్ తో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. రేపు శుక్రవారం(డిసెంబర్ 5న) రెగ్యూలర్ రిలీజ్ ఉండనుంది. అయితే ఈ సందర్భంగా బాలయ్య నటించిన ఇండస్ట్రీ హిట్ `నరసింహనాయుడు`తో పోటీ పడి డిజాస్టర్లుగా మిగిలిన చిరంజీవి, వెంకటేష్ సినిమాలేంటో తెలుసుకుందాం.
25
బాక్సాఫీసుని షేక్ చేసిన `నరసింహనాయుడు`
బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో `నరసింహనాయుడు` ఒకటి. ఆ టైమ్‌లో అందరు స్టార్ హీరోలను డామినేట్ చేసే విజయాన్ని ఈ సినిమాతో అందుకున్నారు బాలయ్య. ఫ్యాక్షన్ సినిమాలకు ఇది కేరాఫ్‌గా నిలిచింది. `సమరసింహారెడ్డి` బ్లాక్ బస్టర్ తర్వాత వెంటనే మరో ఇండస్ట్రీ హిట్ ఈ చిత్రంతో అందుకున్నారు బాలయ్య. ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకుడు కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ పరంపరలోనే ఈ మూవీ వచ్చి బాక్సాఫీసుని షేక్ చేసింది. ఇందులో సిమ్రాన్ హీరోయిన్‌గా నటించింది. వెంకటరమణ ప్రొడక్షన్స్ పతాకంపై ఎంబీ మురళీకృష్ణ నిర్మించారు. 2001 జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలైంది.
35
అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రం
`నరసింహనాయుడు` సినిమా కేవలం ఏడెనిమిది కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఏకంగా రూ.30కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ని వసూలు చేసింది. దాదాపు 25ఏళ్ల క్రితం ఈ స్థాయిలో కలెక్షన్లు అంటే మామూలు విషయంలో కాదు. ఆ ఏడాది వచ్చిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంతకు ముందు అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా `కలిసుందాం రా` ఉంది. దాని రికార్డులను బ్రేక్ చేసింది ఈ బాలయ్య మూవీ. ఇది 101 కేంద్రాల్లో ఏకంగా వంద రోజులు ఆడింది. ఇలా వంద రోజులు ఇన్ని థియేటర్లలో ఆడిన తొలి చిత్రంగా `నరసింహనాయుడు` రికార్డులు సృష్టించింది. ఇందులో బాలయ్య మార్క్ యాక్షన్, మాస్ డైలాగులు, పాటలు ఆడియెన్స్ ని ఉర్రూతలూగించాయి.
బాలయ్య `నరసింహనాయుడు`తో పోటీ పడి చిత్తైన చిత్రాలున్నాయి. వాటిలో మొదటిది మెగాస్టార్ చిరంజీవి నటించిన `మృగరాజు` కావడం గమనార్హం. బాలయ్య మూవీ విడుదలైన రోజే, ఆ సినిమాకి పోటీగా జనవరి 11నే `మృగరాజు` విడుదలైంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులోనూ హీరోయిన్‌గా సిమ్రాన్ నటించడం విశేషం. యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందించారు. సంఘవి కీలక పాత్ర పోషించింది. నాగబాబు మరో పాత్రలో నటించారు. మణి శర్మ సంగీతం అందించారు. పాటలు హిట్ అయ్యాయి. కానీ సినిమా ఆడలేదు. చిరంజీవి ఓ ప్రయోగాత్మకంగా ఈమూవీ చేయడం విశేషం. కానీ ఆడియెన్స్ దీన్ని తీసుకోలేకపోయారు. సంక్రాంతికి వచ్చినా సరి పట్టించుకోలేదు. ఓ వైపు బాలయ్య `నరసింహనాయుడు`తో విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఆ తుఫాన్‌కి కొట్టుకుపోయింది `మృగరాజు`. డిజాస్టర్‌గా నిలిచింది.
55
వెంకటేష్‌కి `దేవీపుత్రుడు`తో నిరాశ తప్పలేదు
అదే సంక్రాంతికి `నరసింహనాయుడు`తో పోటీ పడి పరాజయం చెందిన మరో సినిమా `దేవీిపుత్రుడు`. వెంకటేష్, సౌందర్య జంటగా నటించారు. ఫాంటసీ డ్రామాగా దీన్ని రూపొందించారు దర్శకుడు కోడిరామకృష్ణ. ఎంఎస్ రాజు నిర్మించారు. అంజలా జవేరీ మరో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కూడా అదే సంక్రాంతికి జనవరి 14న విడుదలైనా ఆడియెన్స్ కి ఎక్కలేదు. సంక్రాంతి కావడంతో కొంత వరకు బలవంతంగా ఆడింది, కానీ అంతిమంగా నిర్మాతలకు నష్టాలను తీసుకొచ్చింది. `నరసింహనాయుడు` దెబ్బకి చిత్తైపోయింది. పోటీలో లేకుండా వస్తే బాగానే ఆడేదేమో అనే అభిప్రాయం కూడా వినిపించింది. ఏదేమైనప్పటికీ 2001 సంక్రాంతికి బాలయ్య `నరసింహనాయుడు` ప్రభంజనం ముందు చిరంజీవి `మృగరాజు`, వెంకటేష్ `దేవీపుత్రుడు` చిత్రాలు అడ్రస్ లేకుండాపోయాయని చెప్పొచ్చు.