ఇటీవల ఏఐతో హీరోయిన్ల ఫోటోలని అసభ్యకరంగా రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా రష్మిక ఏఐతో ఇబ్బందులు ఎదుర్కొంది. దీనిపై ఆమె సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది.
రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ హీరోయిన్స్ లో ఒకరు. ఇటీవల ఆమెకి యానిమల్, పుష్ప 2 లాంటి భారీ విజయాలు దక్కాయి. రష్మిక లాంటి స్టార్ హీరోయిన్లని ఇటీవల కొందరు డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు.. ఏఐ జెనెరేటెడ్ అసభ్యకరమైన ఫొటోలతో టార్గెట్ చేస్తున్నారు. చాలా మంది నటీమణులు ఏఐ బారిన పడిన సంగతి తెలిసిందే.
25
రష్మిక అసభ్యకర ఫోటోలు వైరల్
చాలా మంది నటీమణులు ఇప్పటికే ఏఐ ని అసభ్యకరమైన పనులకు ఉపయోగించడంపై గళం విప్పారు. తాజాగా రష్మిక మందన్న తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసింది. ఇటీవల ఆమె నటించిన థామ చిత్రం ఓటీటీలో విడుదలయింది. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీనితో రష్మిక ఫోటోలని ఏఐతో కొందరు అసభ్యంగా తయారు చేశారు.
35
రష్మిక ఆవేదన
దీనితో రష్మిక ఏఐ ని ఇలా దుర్వినియోగం చేస్తూ మహిళలని టార్గెట్ చేయడం పై ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిజాన్ని మార్చే ఈ రోజుల్లో.. ఏది నిజమో ఏది అబద్దంతో తెలుసుకోవగలగడమే మనకు రక్షణ. ఏఐ అనేది మన ప్రగతికి దోహదపడాలి. కానీ దానిని అసభ్యకరమైన పనులకు వాడడం, మహిళల్ని కించపరిచేందుకు ఉపయోగించడం అనేది దిగజారుడు తనానికి సూచన.
ఇంటర్నెట్ అనేది ఇకపై నిజానికి అద్దం లాంటిది కాదు. ఏదైనా సృష్టించగలిగే కాన్వాస్ గా మారిపోయింది. మనమంతా ఏఐని దుర్వినియోగం చేయకుండా ప్రగతికి ఉపయోగించుకోవాలి. ఆ విధంగా మన చర్యలు ఉండాలి. మనుషుల్లాగా ప్రవర్తించని వారిని కఠినంగా శిక్షించాలి అంటూ రష్మిక పోస్ట్ చేసింది.
55
రష్మిక నటించిన చిత్రాలు
మొత్తంగా రష్మిక ట్వీట్ తో మరోసారి ఏఐ పై చర్చ జరుగుతోంది. రష్మిక చివరగా ది ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఆమె థామ అనే చిత్రంలో నటించింది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.