బిగ్ బాస్ తెలుగు 9 షోలో మొదటి ఫైనలిస్ట్ గా అవకాశం పొందేందుకు ఇంటి సభ్యుల మధ్య పోటీలు జరుగుతున్నాయి. తనూజ, సుమన్ శెట్టి మధ్య జరిగిన పోటీలో.. తనూజకి భరణి ఝలక్ ఇచ్చారు. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకోండి.
బిగ్ బాస్ తెలుగు 9లో షోలో చివరి దశ కోసం ఇంటి సభ్యుల మధ్య పోటీ మొదలైంది. మొదటి ఫైనలిస్ట్ అయ్యేందుకు బిగ్ బాస్ టాస్కులు మొదలు పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లో 87వ రోజు మొదటి పోటీ సుమన్ శెట్టి, తనూజ మధ్య జరిగింది. ఈ పోటీ పేరు బ్యారెల్.. బ్యాలెన్స్.. బ్యాటిల్. ఈ పోటీ ప్రకారం రోప్ సహాయం తో ఇద్దరు పోటీ దారులు వాళ్ళకి ఇచ్చిన బ్యారెల్ ని బ్యాలన్స్ చేయాలి. సంచాలకులు ఒక్కో ఇంటి సభ్యులని పిలుస్తారు. ఆ ఇంటి సభ్యులు వచ్చి తమకి ఇష్టం లేని, ఫస్ట్ ఫైనలిస్ట్ రేసులో ఉండకూడదు అని భావించిన పోటీ దారుడి బ్యారెల్ లో ట్యాప్ ఓపెన్ చేసి బెల్ మోగే వరకు నీళ్లు నింపాలి.
25
తనూజకి భరణి ఝలక్
అందులో నీళ్లు నిండే కొద్దీ పోటీ దారులు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి. ఎవరు బ్యాలెన్స్ చేయలేక బ్యారెల్ ని వదిలేస్తారో, ఎవరి బ్యారెల్ ముందుగా నిండిపోతుందో వారు ఓటమి చెందినట్లు. సంచాలకులుగా సంజన వ్యవహరించింది. సంజన ముందుగా భరణిని పిలిచింది. భరణి.. తనూజ వద్దకు వెళ్లి ఆమె బ్యారెల్ లో నీళ్లు వదిలారు. సుమన్ శెట్టి బ్యారెల్ లో కొందరు ఇంటి సభ్యులు నీళ్లు వదిలారు. భరణి మాత్రం ఎక్కువసార్లు తనూజ బ్యారెల్ లోనే నీళ్లు వదలడం విశేషం. హౌస్ లో ఇద్దరి బాండింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ భరణి తనూజకి ఝలక్ ఇచ్చారు.
35
సుమన్ శెట్టిని టార్గెట్ చేసిన కళ్యాణ్
తనూజ బ్యారెల్ బరువుగా మారడంతో వదిలేసింది. దీనితో ఆమె ఓటమి చెందడం, సుమన్ శెట్టి విజయం సాధించడం జరిగింది. దీనితో ఆ తర్వాత పోటీలో సుమన్ శెట్టి, పవన్, కళ్యాణ్ ముగ్గురూ పోటీ పడ్డారు. వీరికి కేటాయించిన బాక్స్ లలో మధ్యలో ఉన్న బ్లాక్స్ ని తీసుకుని పెట్టుకోవాలి. ఎండ్ బజర్ మోగే సమయానికి ఎవరి బాక్స్ లో ఎక్కువ బ్లాక్స్ ఉంటే వాళ్ళు విన్నర్. ఈ క్రమంలో ప్రత్యర్థి బాక్స్ లో ఉన్న బ్లాక్స్ ని కూడా లాక్కోవచ్చు. దీనితో కళ్యాణ్, పవన్ ఇద్దరూ సుమన్ శెట్టినే టార్గెట్ చేశారు. కళ్యాణ్ ఎక్కువగా సుమన్ శెట్టిని టార్గెట్ చేయడంతో పవన్ తన వద్ద ఉన్న బ్లాక్స్ ని సేఫ్ గా చూసుకున్నాడు. చివరికి ఈ టాస్క్ లో పవన్ విజయం సాధించాడు.
ఈ టాస్క్ లో సుమన్ శెట్టి ఓటమి చెందినందుకు తాను హ్యాపీ అని.. ఎక్కడ నువ్వు, పవన్ పోటీ పడి సుమన్ శెట్టి గెలిచేలా చేస్తారో అని టెన్షన్ పడినట్లు ఇమ్మాన్యుయేల్ కళ్యాణ్ తో తెలిపారు.
55
పవన్ పై నెగ్గిన భరణి
ఈ టాస్క్ లో విజయం సాధించిన కళ్యాణ్ నెక్స్ట్ టాస్క్ లో భరణితో పోటీ పడ్డారు. ఈ టాస్క్ పేరు వారధి కట్టు, విజయం పట్టు. ఈ టాస్క్ ప్రకారం పోటీ దారులకు బాక్స్ లో కేటాయిస్తారు. ఆ బాక్స్ కి ఉన్న చెక్కలు వారధి నిర్మించడానికి సరిపోయే విధంగా ఉంటాయి. ఆ చెక్కలతో వారధి నిర్మించి.. బాక్స్ లోపల ఉన్న బ్యాగ్స్ ని వారధి పై నుంచి తీసుకుని వెళ్లి టేబుల్ పై విసరాలి. ఎవరు ముందుగా ఈ టాస్క్ ఫినిష్ చేస్తే వాళ్లే విజేతలు. ఈ టాస్క్ లో అనూహ్యంగా భరణి పవన్ పై విజయం సాధించారు.