స్టార్ హీరో సినిమా ఎఫెక్ట్, నిద్రలేని రాత్రులు గడిపిన చిరంజీవి..వెళ్లి ముఖం మీదే చెబితే ఏం జరిగిందో తెలుసా ?

Published : Jan 19, 2026, 08:09 AM IST

ఓ స్టార్ హీరో సినిమా చూసిన తర్వాత చిరంజీవికి నిద్ర కూడా పట్టలేదట. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ఆ హీరోకి చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
చిరంజీవి సినిమాలు 

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో మాస్ సినిమాలు చేస్తూనే పెర్ఫార్మెన్స్ కి ప్రాధాన్యం ఉన్న చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు చేశారు. అయితే చిరంజీవి ఎంతో ఇష్టపడి చేసిన రుద్రవీణ లాంటి సినిమాలు చేశారు. కానీ అవి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఎమోషనల్ డెప్త్, నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలని సౌత్ లో కమల్ హాసన్ ఎక్కువగా చేశారు. 

25
కమల్ హాసన్ నటన 

నవరసాలు పలికించడంలో కమల్ హాసన్ ఆయనకు ఆయనే సాటి. కమల్ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఉన్నప్పుడు చిరంజీవి, ఇతర స్టార్స్ కొందరం ఒకే ఫ్యామిలీలా, బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళం అని కమల్ అన్నారు. 

35
ఆ సినిమా వల్లే 

చిరంజీవి గారు స్వాతి ముత్యం సినిమా చూసి ఏవీయం స్టూడియోలో నన్ను కలిశారు. నాకు నిద్ర పట్టడం లేదు అని అన్నారు. మీరు బాగానే ఉన్నారా అని అడిగా.. లేదు అని అన్నారు. ఏమైంది అని అడిగితే.. స్వాతి ముత్యం చూశాను. ఆ సినిమా చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు అని ఓపెన్ గా చెప్పారు. 

45
తమిళంలో కూడా స్టార్ కావలసింది 

అంత బాగా చిరంజీవి గారికి స్వాతి ముత్యం నచ్చింది అని కమల్ హాసన్ అన్నారు. తమిళ హీరోల సినిమాలు తెలుగులో కూడా బాగా రాణిస్తుంటాయి. కానీ తెలుగు హీరోలు ముందు నుంచి తమిళ మార్కెట్ ని పట్టించుకోలేదు. లేకపోతే చిరంజీవి లాంటి వాళ్ళు సులభంగా ఇక్కడ కూడా స్టార్స్ అయ్యేవారు అని కమల్ అన్నారు. 

55
ఏఎన్నార్ కామెంట్స్ 

ఏఎన్నార్ గారు నటించిన ఎన్నో సినిమాలు తమిళంలో అద్భుతంగా ఆడాయి. కొంత కాలం తర్వాత ఆయన తమిళంలో సినిమాలు మానేశారు. ఎందుకు మానేశారు అని ఒకసారి నేను ఏఎన్నార్ గారిని అడిగాను. ఒక తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ పేరు శివాజీ గణేశన్ అని అన్నారు. శివాజీ గణేశన్ వచ్చిన తర్వాత తమిళంలో సినిమాలు మానేసినట్లు ఏఎన్నార్.. కమల్ హాసన్ కి తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories