Karthika Deepam 2 Today Episode: దీప ఫ్యూచర్ చెప్పిన గురువు- తల్లి కోసం బిడ్డను వదులుకోవాల్సి వస్తుందా?

Published : Jan 19, 2026, 07:58 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 19వ తేదీ)లో శాంపిల్స్ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన జ్యో. వదిలిపెట్టని కార్తీక్. జ్యో జాతకం చెప్పిన గురువు. దీపతో బిడ్డ జాగ్రత్త అని చెప్పిన గురువు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

PREV
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో పారు, జ్యో, కార్తీక్ హాస్పిటల్ కి వెళ్తారు. మీరు ఎన్ని టెస్టులైతే చేయాలి అనుకుంటున్నారో అన్ని టెస్టులు చేసేయండి డాక్టర్ అంటాడు కార్తీక్. నువ్వు ఆగురా.. అసలే జ్యోత్స్నకు ఇంజెక్షన్ అంటే భయం అంటుంది పారు. అవును అంటుంది జ్యోత్స్న. టెస్టులు చేయడానికి ఇంజెక్షన్స్ వేయరు పారు. బ్లెడ్ తీసుకుంటారు అని చెప్తాడు కార్తీక్. నిజం ఎక్కడ బయటపడుతుందోనని లోలోపల వణికిపోతూ ఉంటుంది జ్యోత్స్న. నేను ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్తుంది పారు. 

27
మీరు సుమిత్ర కూతురేనా?

నేను షాంపిల్స్ ఇవ్వడానికి రెడీగా లేను. నాకు కాస్త టెన్షన్ గా ఉంది అంటుంది జ్యోత్స్న. మనకు అస్సలు టైం లేదు. మీ అమ్మగారి పరిస్థితి చూశారు కదా అంటుంది డాక్టర్. నాకు కొంచెం టైం కావాలి అంటుంది జ్యోత్స్న. అసలు మీరు సుమిత్ర కూతురేనా అని అడుగుతుంది డాక్టర్. కార్తీక్ మీరు బయటకు వెళ్లండి. జ్యోత్స్న ఎందుకో ఇబ్బంది పడుతోంది. నేను తనతో మాట్లాడుతాను అని చెప్తుంది డాక్టర్. కార్తీక్ బయటకు వెళ్తాడు. పారు, దాసుకు ఫోన్ చేస్తుంది. కానీ దాసు ఫోన్ లిఫ్ట్ చేయడు.

37
కన్నీళ్లు పెట్టుకున్న శివన్నారాయణ

మరోవైపు కాంచన మాటలను గుర్తుచేసుకుంటూ బాధపడుతాడు శివన్నారాయణ. దీప వచ్చి కాఫీ ఇస్తుంది. అమ్మకు ఏం కాదు పెద్దయ్య. మీరు బాధపడకండి అంటుంది. నువ్వు నన్ను తాతయ్య అని పిలవొచ్చు అమ్మా అంటాడు శివన్నారాయణ. ఇందాక కాంచన ఫోన్ చేసి ఓ మాట అంది. ఈ ఇంటి కోడళ్లకు ఏదో శాపం ఉండొచ్చు అని. నా భార్య నేను చూస్తుండగానే నన్ను, పిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి నా కొడుక్కి వస్తుందేమోనని నాకు భయంగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంటాడు శివన్నారాయణ.

మీరే ఇలా ఉంటే అమ్మకు ధైర్యం ఎవరు చెప్తారు. అమ్మకు ఏం కాదు. డాక్టర్ గారు చెప్పారు కదా.. పరిష్కారం ఉందని అంటుంది దీప. అవును తన కూతురు తనని కాపాడుతుందని డాక్టర్ చెప్పారు. ఒకసారి గురువు గారికి ఫోన్ చేస్తాను. ఆయన కూడా ఏం చెప్తారో వెంటే మనకు ధైర్యంగా ఉంటుందని గురువు గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు శివన్నారాయణ.

47
కాస్త భయంగా ఉందన్న జ్యో

కార్తీక్, పారు బయట నిలబడి ఉంటారు. డాక్టర్ బయటకు వచ్చి జ్యోత్స్న శాంపిల్స్ ఇవ్వడానికి రెడీగా లేదు కార్తీక్. తను ఎందుకో పానిక్ అవుతోంది అని చెప్తుంది. మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్లి మాట్లాడి వస్తాను అని జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు కార్తీక్. ఏమైంది పెద్ద మేడం. శాంపిల్స్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతాడు కార్తీక్. నాకు ఈ హాస్పిటల్ వాతావరణం చూస్తే కాస్త భయంగా ఉందని చెప్తుంది జ్యోత్స్న. 

57
తాతకు ఫోన్ చేయమంటావా?

సరే ఆగు తాతకు ఫోన్ చేసి అదే మాట చెప్తాను అంటాడు కార్తీక్. ఏంటి బావ భయపెడుతున్నావా? అంటుంది జ్యోత్స్న. నువ్వు భయపడుతున్నావా? అంటాడు కార్తీక్. నీకు నిజం తెలిసి ఇలా చేస్తున్నావో.. తెలియక చేస్తున్నావో అర్థం కావడం లేదు. కానీ శాంపిల్స్ ఇస్తే మాత్రం నా జాతకం బయటపడ్డట్లే అని వణికిపోతుంది జ్యోత్స్న. తాతకు ఫోన్ చేయమంటావా అంటాడు కార్తీక్. వద్దు ఇస్తాను అంటుంది జ్యోత్స్న.

కార్తీక్ డాక్టర్ దగ్గరికి వెళ్లి జ్యోత్స్న శాంపిల్స్ ఇవ్వడానికి రెడీగా ఉందని చెప్తాడు. అదేంటి ఒప్పుకుందా అంటుంది పారు. ఒప్పుకోకపోవడానికి ఏం ఉంటుంది అంటాడు కార్తీక్. నువ్వు ఏదైనా చేయగలవు అంటుంది పారు.

67
దీప వల్లే ఈ ఇంటికి అరిష్టం

మరోవైపు గురువు గారు శివన్నారాయణ ఇంటికి వస్తారు. నేను చెప్పాను కదా కర్మ ఫలితం ఎవరు తప్పించుకోలేరని... ఆ రోజు పూర్ణాహుతి హోమ గుండంలో పడకుండా కింద పడితే ఈ సమస్యకు పరిష్కారం దొరికేది కాదు.. దీపే దాన్ని కిందపడకుండా కాపాడింది అంటాడు గురువు. 

అప్పటినుంచే ఈ ఇంటికి అరిష్టం మొదలైంది అంటుంది జ్యోత్స్న. ఇంటి వారసురాలు చేతుల మీదుగా పడాల్సిన పూర్ణాహుతి పని మనిషి చేతుల మీద పడితే అందరూ ఆమేదో గొప్ప పనిచేసినట్లు చెప్తున్నారు ఏంటి అని అంటుంది జ్యోత్స్న. ఈ సమస్య రావడానికి కారణమే దీప అంటుంది జ్యోత్స్న. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందిలే అంటాడు గురువు.

గురువు గారు మీరు మొహం చూసి కూడా జాతకం చెప్తారు కదా.. ఈ మధ్య జ్యోత్స్న ఎందుకో బాగా టెన్షన్ పడుతోంది. తన భవిష్యత్తు గురించి చెప్పండి అంటాడు కార్తీక్. సాలేగూడులో చిక్కుకున్నట్లు ఇబ్బంది పడుతున్నావు. త్వరలో దాని నుంచి బయటపడతావు. ముందు ముందు చాలా కష్టపడాల్సి వస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తాడు గురువు.

77
కడుపులో బిడ్డ జాగ్రత్త

దీప భవిష్యత్తు గురించి కూడా చెప్పమని అడుగుతాడు కార్తీక్. నీ భవిష్యత్తు కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంది. నువ్వు కావాలనుకున్న దానికోసం కోరుకున్నది వదిలేయాల్సి వస్తుంది. కానీ నీకు మంచే జరుగుతుంది. సొంత గూటికి చేరే రోజు దగ్గర్లోనే ఉంది అంటాడు గురువు. దీపకు కన్నవాళ్లు లేరు కదా.. సొంతింటికి ఎలా చేరుకుంటుంది అని ప్రశ్నిస్తుంది పారు. దీప కన్నవాళ్లు ఎవరో త్వరలోనే తెలుస్తుంది అంటాడు గురువు.

నీ గండం పూర్తిగా గట్టెక్కిందని చెప్పలేను.. కానీ కాస్త జాగ్రత్తగా ఉండమని సుమిత్రతో చెప్తాడు గురువు. దీప వైపు చూసి కడుపులో బిడ్డ జాగ్రత్త అమ్మా అని చెప్తాడు. దైవాన్ని నమ్ముకోండి. అంతా మంచే జరుగుతుందని చెప్పి వెళ్లిపోతాడు. శాంపిల్స్ తీసుకున్నారా జ్యోత్స్న అని అడుగుతాడు శివన్నారాయణ. తీసుకున్నారు తాత అంటుంది జ్యో. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి అని అడుగుతాడు. కాల్ చేసి చెప్తామన్నారు అంటుంది జ్యో. దశరథను ఫాలో అప్ చేయమంటాడు శివన్నారాయణ. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక జ్యోత్స్న, పారు గింజుకుంటూ ఉంటారు అని మనసులో అనుకుంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories