పొట్టకూటి కోసం పొట్ట మాడ్చుకుంటున్నా.. డైట్ సీక్రెట్ వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి

Published : Jan 19, 2026, 08:01 AM IST

రీసెంట్ గా రిలీజ్ అయిన 'మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించాడు.. స్లిమ్ గా..యంగ్ హీరోల మాదిరి మెరిసిపోయాడు. అందుకోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత కష్టపడ్డాడో తెలుసా?

PREV
15
స్లిమ్ గా మారిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవిని 'మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో సరికొత్త అవతారంలో చూపించాడు అనిల్ రావిపూడి. అభిమానులకు చెప్పి మరీ.. సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈమూవీలో చిరంజీవి చాలా స్లిమ్ గా.. కుర్ర హీరోలాగా మారిపోయాడు. అంతే కాదు.. మునుపటి ఉత్సాహం, ఉల్లాసం రెట్టించిన ఎనర్జీ కనిపించింది చిరంజీవిలో. పెర్ఫామెన్స్ పీక్స్ లో చూపించడంతో పాటు.. ఏడు పదుల వయస్సులో మెగాస్టార్ వేసిన స్టెప్పులు.. అందరికి ఆశ్చర్యం కలిగించాయి. చూస్తూ చూస్తూనే.. చిరంజీవి ఇలా ఎలా మారిపోయారు.. అంత వెయిట్ ఎలా తగ్గారు.. అని అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. అది కూడా మంచి భోజన ప్రియుడైన మెగాస్టార్ తిండి విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటా అని చర్చించుకున్నారు.

25
చిరంజీవి భోజన ప్రియుడు..

సాధారణంగా చిరంజీవి మంచి భోజన ప్రియుడు. అయిన రకరకరకాల రుచులను ఆస్వాదిస్తుంటాడు. వెజ్ నాన్ వెజ్ లలో అన్ని రకాలు తింటారు మెగాస్టార్. మరీ ముఖ్యంగా చిరంజీవి ఇంట్లో దోశలు చాలా స్పెషల్. చిరు దోశాల పేరుతో బయటు హోటళ్లు కూడా ఉన్నాయి. ఆయన భార్య సరేఖకు కూడా వంట నేర్పించింది మెగాస్టారే నట. ఇక చిరంజీవి చాలా ఇష్టంగా తినేది మాత్రం సీ ఫుడ్స్. చేపలు, రొయ్యల కూరంటే ఆయన డేట్ ను కూడా బ్రేక్ చేయాల్సిందే. అందులోను అమ్మ చేసిన చేపల వేపుడు అయితే వదలకుండా తింటారు. ఈ విషయాన్ని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

35
కడుపు మాడ్చుకుంటున్న మెగాస్టార్ ..

ఇక రీసెంట్ గా 'మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం స్ట్రిక్ట్ డైట్ చేశారు చిరంజీవి. అనిల్ రావిపూడి చెప్పిన లుక్ రావడం కోసం ఆయన నోరు కట్టుకుని.. తిండి మానేసి.. ప్రాపర్ డైట్ ను మెయింటే చేశాడు. కాస్త కూడా ఆయిల్ లేకుండా.. శరీరానికి కావల్సిన ప్రోటీన్ ను మాత్రమే సరిపోను తీసుకుంటూ వచ్చారు. అందుకు తగ్గట్టుగా వర్కౌట్లు చేసి.. చాలా వరకూ వెయిట్ తగ్గారు చిరంజీవి. రీసెంట్ గా 'మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు చిరు. అందులో వెంకటేష్, అనిల్ రావిపూడి, నిర్మాతలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి తన చేత్తో స్వయంగా దోసెలు వేసి అందరికి వడ్డించారు.

45
పొట్టకూటి కోసం తప్పదంటున్న చిరంజీవి

ఇంటర్వ్యూ కొనసాగుతున్న సమయంలో ఓ సందర్భంలో చిరంజీవి తన చేతులతో వండిన కొన్ని వంటకాలను అందరికీ వడ్డించారు. వేడి వేడిగా దోశలు వేసి అనిల్ రావిపూడికి, వెంకటేష్ కి వడ్డించారు చిరు. ఈ సందర్భంగా చిరంజీవిని కూడా తినాలని వెంకటేష్ అడిగారు. మెగాస్టార్ మాత్రం తిననని చెప్పారు. దీంతో.. డైట్ చేస్తున్నావని, స్లిమ్ గా, సన్నగా అయిపోయి సినిమాలో తనను డామినేట్ చేశావని సరదాగా వెంకీ వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా... పొట్టకూటి కోసం బాబు.. పొట్ట కూటికోసం పొట్ట మాడ్చుకుంటున్నాను అని చిరు చమత్కరించారు. అందరికీ అన్నీ తినే అదృష్టం ఉండదని మెగాస్టార్ అన్నారు. దీంతో.. అక్కడున్నవారి మధ్య నవ్వులు విరబూశాయి.

55
70 ఏళ్ల వయసులో తగ్గేదేలే..

చిరంజీవి 70 ఏళ్ల వయసులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ వయసులో కూడా తగ్గేదే లేదంటున్నాడు. 30 ఏళ్ల వయసులో ఎంత ఎనర్జిటిక్ గా నటించి, డాన్స్ చేసి.. సందడి చేశాడో.. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో కూడా అదే ఎనర్జీని చిరంజీవి చూపిస్తున్నారు. వరుస సినిమాలతో కుర్ర హీరోలకు కూడా ఛాలెంజ్ చేస్తన్నాడు చిరంజీవి. మన శంకర వరప్రసాద్ గారు సినిమా తరువాత ఆయన విశ్వంభరతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఈసినిమాతో పాటు బాబీ డైరక్షన్ లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ చేయబోతున్నాడు మెగాస్టార్. ఈసినిమాలో ఆయన గ్యాంగ్ స్టార్ గా కనిపించున్నాడట. అంతే కాదు ఈసినిమాలో మెగా జోడీగా ఐశ్వర్యరాయ్ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories