చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత హీరోయిన్ గా చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?

First Published | Oct 9, 2024, 8:05 PM IST

మెగా ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, మరి హీరోయిన్లు..? నిహారికా ఉంది కదా అని అనుకుంటున్నారా..? నిహారిక కంటే ముందు మెగాఫ్యామిలీ నుంచి ఓ హీరోయిన్ ఇండస్ట్రీలోకి వచ్చిందని మీకు తెలుసా..? 

తెలుగు సీనిమా పరిశ్రమలో.. ఎలాంటి  బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. కష్టపడి పైకి వచ్చిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరసులో ఉంటారు. సినిమా నేపథ్యం లేకుండా వచ్చి.. టాలీవుడ్ నే ఏలేస్తున్నాడు మెగాస్టార్. నందమూరి, అక్కినేని వారసత్వాన్ని కూడా కాదని.. ప్రేక్షకులు మెగా హీరోను ఆదరించారు. ఆయన ఫ్యామిలని కూడా హక్కున చేర్చుకున్నారు. 

ప్రియురాలి రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సల్మాన్ ఖాన్.

Chiranjeevi, Ooty, Vishwambhara

ఇక ఇప్పుడు చిరంజీవి ఒక్కడు కాదు.. తెలుగు సినిమాపరిశ్రమలో మెగా  సామ్రాజ్యాన్నే స్థాపించాడు.  చిన్న హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసి.. అంచలంచెలుగా ఎదుగుతూ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి అరడజకు పైగా హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. 

రామ్ చరణ్, ఎన్టీఆర్.. స్టార్ హీరోల ఫస్ట్ మూవీ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?


Niharika Konidela

అంతే కాదు మెగా ఫ్యామిలీ నుంచి నిర్మాతలు కూడా ఉన్నారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే..మెగా డాటర్ నిహారిక మాత్రమే కనిపిస్తుంటుంది. మెగాఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా చేసింది నిహారిక మాత్రమే.

కాని ఆమె కూడా పెద్దగా రాణించలేకపోయింది. యాంకర్ గా, హీరోయిన్ గా, నిర్మాతగా.. మల్టీ టాలెంట్ చూపించింది నిహారిక. అయితే పెళ్ళి తరువాత అన్నింటికి దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. రీసెంట్ గా విడాకులు తసీుకుని... మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

నిర్మాతగా వెబ్ సిరీస్ లు, చిన్న స ినిమాలు నిర్మిస్తోంది నిహారిక. అయితే మెగా ప్యామిలీ నుంచి నిహారిక మాత్రమే కాదు.. గతంలో మరోకరు కూడా హరోయిన్ గా మారాలనిప్రయత్నాలు చేశారని మీకు తెలుసా. 

శోభన్ బాబు నిక్కర్ వేసుకుని నటించిన సినిమా ఏదో తెలుసా..?

Chiranjeevi Daughter Susmitha

అవును.. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలో పని చేస్తున్న విషయం తెలిసిందే. ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ.. ఆ తరువాత నిర్మాతగా స్థిరపడ్డారు సుస్మిత.  

అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే. ? సుస్మిత కూడా ఒక సినిమాలో హీరోయిన్ గా నటించారట అవును చిరంజీవికి ఇద్దరు కూతర్లు ఉన్నా.. ఎవరు హీరోయిన్లు గామారలేదు అని అందా అనుకుంటుంటారు.

కాని మెగాస్టార్ తన పెద్ద కుమార్తె  సుస్మితను హీరోయిన్ గా చూడాలి అనుకున్నారట. అయితే ఎప్పుడు ఆ విధంగా ప్రయత్నం చేసిన ప్రతీసారి. ఏదో ఒక ఇబ్బంది వచ్చిపడేదట. 

అంతే కాదు టాలీవుడ్ టాక్ ప్రకారం సుస్మిత ఓ మూవీలో హీరోయిన్ గా నించిందట. ఆసినిమా ను పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేయగా.. ఉదయ్ కిరణ్ హీరోగా నటించాడట. ఫస్ట్ హాఫ్ మూవీ మొత్త షూటింగ్ అయిపోయిందట  కూడా. కాని సెకండ్ హాఫ్ షూటింగ్ కు కొన్ని ఆటంకాలు వచ్చి సినిమా కంప్లీట్ అవ్వలేదట. దాంతో ఆమెను హీరోయిన్ గా చేయాలన్న ప్రయత్నం మానేశారట. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

ఈ న్యూస్ లో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి మాత్రం 70 ఏళ్ళకు అడుగు దూరంలో ఉన్నాడు. వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్ట్ కాంబినేషన్ లో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు చిరంజీవి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమా రిలీజ్ కాబోతోంది. 

Latest Videos

click me!