శోభన్ బాబు నిక్కర్ వేసుకుని నటించిన సినిమా ఏదో తెలుసా..? కాని ఆసినిమా ఎలా మిస్ అయ్యిందంటే..?

First Published | Oct 9, 2024, 6:58 PM IST

ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు.. ఆయన తన కెరీర్ లో ఎప్పుడూ డీ గ్లామర్ రోల్స్ చేయలేదు. అయితే ఒక్క సినిమాలో మాత్రం నిక్కర్ వేసుకుని నటించానికి ఆయన ఒప్పుకున్నారట. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా..? 

ఆంధ్రులకు అందాల నటుడు అంటే అప్పటికీ.. ఇప్పటికీ.. శోభన్ బాబే. ఆయన ఆహార్యం, నటన, హెయిర్ స్టైల్.. మెయింటేనెస్.. అన్నీ ఇప్పటి కుర్రాళ్లకు కూడా ఆదర్శనీయం. చాలా పద్దతిగా.. నీట్ గా  ఉండేవారు శోభన్ బాబు.

హీరోగా ఆయన సినిమాల గురించి మనకు తెలిసిందే. అయితే శోభన్ బాబు డీగ్లామర్ పాత్రలు చేసింది మాత్రం ఇంత వరకూ ఎవరికీ తెలియదు. ఏ సీనిమాలో కూడా ఆయన డీ గ్లామర్ రోల్ లో కనిపించలేదు.  

Sobhan Babu

ఎంత పేద పాత్రలు చేసినా.. ఆ పేదల బట్టల్లో కూడా శోభన్ బాబు గ్లామర్ గానే కనిపించేవారు. ఆయన గ్లామర్ కే ఎక్కువ సినిమాలు ఆడేవి. ఇఫ్పుడు త్రివిక్రమ్ ఫాలో అవుతున్న ఫార్ములాను అప్పుడు శోభన్ బాబు పక్కాగా ఆచరణలో ఉంచారు. కాగా శోభర్ బాబు డీ గ్లామర్ రోల్ కూడా చేసిన సినిమా ఒకటి ఉంది.

ఆసినిమాలో శోభన్ బాబు నిక్కర్  వేసుకుని కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. అంతే కాదు వేసుకుని నటించాడు కూడా. అయితే శోభన్ బాబు ఒకే అన్నా.. దర్శకుడికి మాత్రం ఎందుకో ఇలా చేయడం కరెక్ట్ అనిపించలేదట.

దాంతో బాబుగారిని బ్రతిమలాడుకుని మరీ.. వద్దండీ..మిమ్మల్ని ఇలా చూడలేము.. అని చెప్పి ఆ సినిమాను వేరే హీరో పెట్టి చేశాడట.కట్  చేస్తూ.. ఆసినిమా సూపర్ డూపర్ హిట్. ఆల్ టైమ్ హిట్.. ఇప్పటికీ ఆసినిమా ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఒకటిగా అలా నిలిచిపోయింది. 
 


ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు పదహారేళ్ల వయస్సు. అవును ఈసినిమాలో చంద్రమోహన్ పాత్ర శోభన్ బాబు చేయాల్సిందేట. దానికి ఆయన ఒకే కూడా చేప్పారట. ఈసినిమా దర్శఖుడు రాఘవేంద్రరావు మాత్రం అందాల నటుడు శోభన్ బాబు అలాంటి పాత్రలో వద్దు అని.. చంద్రమోహన్ ను తీసుకున్నాడట. అయితే చంద్రమోహన్ కు కూడా ఎక్కువగా నిక్కర్ లో కనిపించకుండా.. పంచెలో కనిపించేలా ప్లాన్ చేశాడట దర్శకుడు. 

అప్పుడు వారు కొన్న ఆ పంచె, కంప్లీట్ డ్రెస్ రేటు  రూపాయలు అని ఓ సందర్భంలో అప్పటి సినిమా పండితుడు ఒకరు చెప్పగా తెలిసింది.  సో శోభన్ బాబును ఇలా డీ గ్లామర్ రోల్ లో  మిస్ అయ్యారు ఆయన అభిమానులు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తరువాత టైర్ 1 హీరోల లిస్ట్ లో శోభన్ బాబు కూడా ఉన్నారు. తెలుగు సినిమాకు గ్లామర్ సొగబులద్దిన ఈ హీరో.. క్రమశిక్షణకు మారు పేరుగా ఉన్నారు. పని విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారట. శోభన్ బాబు హీరోగా మాత్రమే సినిమాలు చేశారు.

ఆతరువాత ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఎంత మంది ఎన్ని కోట్లు ఇస్తామన్నా.. ఆయన పాత్రలు చేయడానికి ఒప్పుకోలేదు. గొప్ప గొప్ప పాత్రలెన్నో వచ్చినా.. ఇంటిదాకా వెళ్ళి బ్రతిమలాడినా శోభన్ బాబు నో అనేసేవారు. దానికి కారణం కూడా లేకపోలేదు. అది కూడా ఆయన వెల్లడించారట. 

Sobhan Babu

 తన అభిమానులు తనను హీరోగా.. అందాల నటుడిగా మాత్రమే చేశారని.. ఆతరువాత ముసలి పాత్రలు, నాన్న పాత్రలు, తాత పాత్రలు తాను చేయనని.. సోగ్గాడిగా ఇలాంటి పాత్రలు చేసి.. తన అభిమానులను నిరాశ పరచలేదనని ఆయన అనేవారట. 

అతడు సినిమాలో మహేష్ బాబు తాతగా శోభన్ బాబు ను తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారట. కాని ఆయన ఆ పాత్ర చేయలేదని అంటుంటారు. ఇలా చాలా పాత్రలకోసం శోభన్ బాబు ఇంటికి వెళ్ళిన వారికి నిరాశే ఎదురయ్యింది. అంతే కాదు.. మీడియా కాని.. ఇంటర్వ్యూలు కాని తన ఇంటిదాకా వచ్చేవి కాదు. 
 

Latest Videos

click me!