దీపికా పదుకొనె చెప్పిన చిట్కాలు పాటిస్తే పరీక్షల్లో ప్రతి విద్యార్థికి మంచి మార్కులు, అన్నీ ఫ్రీగా దొరికేవే

Published : Feb 12, 2025, 05:41 PM IST

Deepika Padukone: విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గరపడింది. ఏడాది మొత్తం నేర్చుకున్న విద్యని పరీక్షల్లో ప్రదర్శించి మంచి మార్కులు సాధించాలి. ప్రతి విద్యార్థి లక్ష్యం ఇదే ఉంటుంది. అయితే పరీక్షల సమయంలో చాలా మంది స్టూడెంట్స్ ఒత్తిడి ఫీల్ అవుతుంటారు.

PREV
14
దీపికా పదుకొనె చెప్పిన చిట్కాలు పాటిస్తే పరీక్షల్లో ప్రతి విద్యార్థికి మంచి మార్కులు, అన్నీ ఫ్రీగా దొరికేవే
Deepika Padukone, Narendra Modi

విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గరపడింది. ఏడాది మొత్తం నేర్చుకున్న విద్యని పరీక్షల్లో ప్రదర్శించి మంచి మార్కులు సాధించాలి. ప్రతి విద్యార్థి లక్ష్యం ఇదే ఉంటుంది. అయితే పరీక్షల సమయంలో చాలా మంది స్టూడెంట్స్ ఒత్తిడి ఫీల్ అవుతుంటారు. ఒత్తిడి వల్ల కొందరు స్టూడెంట్స్ బాగా చదివినప్పటికీ సరిగ్గా ఎగ్జామ్స్ రాయలేకపోతుంటారు. దీనితో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. 

24

ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనె కూడా పాల్గొన్నారు. పరీక్షల్లో ఒత్తిడి దూరం చేసుకుని మంచి మార్కులు సాధించేందుకు దీపికా పదుకొనె స్టూడెంట్స్ కి అద్భుతమైన చిట్కాలు వివరించారు. ముందుగా ప్రతి విద్యార్థి పరీక్షల సమయంలో తమ కంట్రోల్ లో ఉన్న అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయాలని తెలిపారు. దీపికా మాట్లాడుతూ.. మీరు సరిగ్గా ప్రిపేర్ అయ్యారా లేదా చెక్ చేసుకోండి. అది మీ చేతుల్లో ఉన్న పని. మీ తల్లిదండ్రులతో మాట్లాడండి, మీ టీచర్లతో మాట్లాడండి. మీ ఒత్తిడికి కారణాలు చెబితే వాళ్ళు ఏదో ఒక విలువైన సలహా ఇస్తారు. అదే విధంగా క్రమం తప్పకుండ ధ్యానం చేయండి. 

34
Deepika

నేను స్కూల్ లో ఉన్నప్పుడు చాలా నాటీగా ఉండేదాన్ని. ప్రతి ఈవెంట్ లో పాల్గొదనేదాన్ని. దానివల్ల నాపై ఒత్తిడి ఉండేది కాదు. మా తల్లిదండ్రులు కూడా మంచి మార్కుల కోసం నాపై ఒత్తిడి చేయలేదు. తల్లిదండ్రులకు ఒక విషయం చెబుతున్నా.. మీ పిల్లల శక్తిని గమనించి ప్రోత్సహించండి, ఒత్తిడి చేయకండి అని దీపికా పేర్కొంది. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. తప్పు చేస్తామేమో అని కంగారు పడకండి. దానిని స్మూత్ గా డీల్ చేయడం నేర్చుకోండి. అదే విధంగా మీరు ఆరోగ్యంగా, హుషారుగా ఉండడం కూడా ముఖ్యం. 

44

ముందుగా మీకు మంచి నిద్ర అవసరం. నిద్ర అనేది సూపర్ పవర్. అది మీకు ఉచితంగా లభిస్తుంది. అదే విధంగా అవసరమైనంత సేపు సన్ లైట్ లో ఉండాలి. నీళ్లు తాగుతూ హైడ్రేట్ గా ఉండాలి. ఇవన్నీ మీకు ఉచితంగా లభిస్తాయి అని దీపికా పదుకొనె విద్యార్థులకు తెలిపింది. తనకి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి దీపికా పదుకొనె కృతజ్ఞతలు తెలిపారు. మోడీ కూడా దీపికాని అభినందించారు.  

 

Read more Photos on
click me!

Recommended Stories