Ibomma: దుమ్ములేపుతున్న డిప్యూటీ సీఎం భార్య చిత్రం..టెస్ట్యూబ్ బేబీని కనాలనుకునే హీరోయిన్, చివరికి ఏమైంది

Published : Feb 12, 2025, 06:37 PM IST

Ibomma: జయం రవి ఇటీవల తన భార్యతో విడాకుల వ్యవహారంతో వార్తల్లో నిలిచారు. ఇక నిత్యామీనన్ తన ప్రతిభతో హీరోయిన్ గా రాణిస్తోంది. నిత్యామీనన్ కూడా అప్పుడప్పుడూ వివాదాల్లో ఉంటుంది. వీరిద్దరూ కలసి నటించిన 'కాదలిక్క నేరమిల్లై' ఈ ఏడాది సంక్రాంతికి తమిళంలో రిలీజ్ అయింది.

PREV
15
Ibomma: దుమ్ములేపుతున్న డిప్యూటీ సీఎం భార్య చిత్రం..టెస్ట్యూబ్ బేబీని కనాలనుకునే హీరోయిన్, చివరికి ఏమైంది
Kadhalikka Neramillai

జయం రవి ఇటీవల తన భార్యతో విడాకుల వ్యవహారంతో వార్తల్లో నిలిచారు. ఇక నిత్యామీనన్ తన ప్రతిభతో హీరోయిన్ గా రాణిస్తోంది. నిత్యామీనన్ కూడా అప్పుడప్పుడూ వివాదాల్లో ఉంటుంది. వీరిద్దరూ కలసి నటించిన 'కాదలిక్క నేరమిల్లై' ఈ ఏడాది సంక్రాంతికి తమిళంలో రిలీజ్ అయింది. తాజాగా ఈ చిత్రం ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది. 

 

25
Jayam Ravis Kadhalikka Neramillai

నెట్ ఫ్లిక్స్ లో తెలుగు వర్షన్ ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంతలో ఈ చిత్రం ఐబొమ్మలో కూడా లీక్ అయింది. ఇతర టొరెంట్ సైట్స్ లో కూడా లీక్ అయింది. ఐబొమ్మలో ట్రెండింగ్ లో ఈ చిత్రం టాప్ లోకి వచ్చేసింది. థియేటర్స్ లో ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ చిత్ర దర్శకురాలు ఎవరో తెలుసా.. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిగ ఉదయనిధి. 

 

35
Ravi Mohans Kadhalikka Neramillai

కృతిగ ఉదయనిధి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఐబొమ్మల్లో ట్రెండింగ్ గా మారింది అంటే ఈ చిత్ర క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కృతిగ ఉదయనిధి ఈ చిత్రాన్ని వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రొమాంటిక్ అండ్ ఎమోషనల్ చిత్రంగా తీర్చి దిద్దారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నిత్యామీనన్ కి టెస్ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలని కనాలని అనుకుంటుంది. 

 

45

హీరోకి మాత్రం పిల్లలంటే ఇష్టం ఉండదు. వీరిద్దరూ ఎలా ఒక్కటయ్యారు ? నిత్యామీనన్ టెస్ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలని పొందిందా ? అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రంలో జయం రవి, నిత్యా మీనన్ పెర్ఫామెన్స్ కి ప్రశంసలు దక్కాయి. 

 

55

ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తన భార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ స్వయంగా నిర్మించారు. ఈ చిత్రంలో టిజి భాను, వినయ్ రాయ్, యోగి బాబు కీలక పాత్రల్లో నటించారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories