మహేష్ బాబు ఎప్పటికప్పుడు కొత్తలుక్క్ లో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంటాడు. ఆయన కలర్, గ్లామర్, స్టైల్ ఫిట్ నెస్ 50 ఏళ్ళు వస్తున్నా.. ఇప్పటికీ యంగ్ లుక్క్ లోనే ఉన్నాడు మహేష్ బాబు. కుర్ర హీరోలు కూడా కుళ్లుకునేలా ఉన్న మహేష్.. సినిమా సినిమాకు ఇంకా వయస్సు తగ్గించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వర్కౌట్లు, డైట్ ప్లాన్స్ తో తన యవ్వనాన్ని కాపాడుకుంటున్నాడు మహేష్. అంతే కాదు ఆయన అభిమానులు సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
అయితే ఇంత మందికి మహేష్ బాబు అంటే ఇష్టం కదా..? మరి మహేష్ బాబు ఫస్ట్ లవ్ ఎవరికి సొంతం. ఆయన ఫస్ట్ క్రష్ ఎవరు? సూపర్ స్టార్ ఫస్ట్ ఎవరిని ప్రేమించాడు. ఈ విషయం ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? మహేష్ బాబు చాలా చిన్న వయస్సులో ఇండస్ట్రీలోకి వచ్చాడు. బాల నటుడిగా చాలా సినిమాలు చేశాడు. కొన్నాళ్ల గ్యాప్ తరువాత ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన టైమ్ లోనే ఆయన ప్రేమలో పడ్డాడు.
mahesh babu, namratha, rajamouli
కెరీర్ బిగినింగ్ లోనే మహేష్ బాబు తన తో వంశీ సినిమాలో మీరోయిన్ గా నటించిన నమ్రత శిరోధ్కర్ ను ప్రేమించాడు. తన కంటే వయస్సులో పెద్దదైనా సరే ఆమెనే పెళ్లి చేసుకున్నాడు మహేష్. దాదాపు ఐదేళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట చాలా సింపుల్ గా ముంబయ్ లో పెళ్లి చేసుకున్నారు. అయితే మహేష్ బాబు లైఫ్ లో ఫస్ట్ క్రష్ ఆయన వైఫ్ నమ్రతానే. ఈ విషయం ఆయనే వెల్లడించారు. తానను చూడగానే ప్రేమలో పడిపోయాను అని మహేష్ అన్నారు.
26 సంవత్సరాల వయస్సులో తొలిసారి నమ్రతతో ప్రేమలో పడ్డానని ఆయన అన్నారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే మహేష్ సినిమాలో నమ్రత నటిస్తే చూడాలని ఉందంటూ ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ పాన్ వరల్డ్ మూవీతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో 1000 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నాడు మహేష్. అమెజాన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కతున్న ఈసినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది.