తిరుమలలో గుండు చేయించుకున్న పవన్ కళ్యాణ్ భార్య, కొడుకు కోసం మొక్కు తీర్చుకున్న అన్నా లెజినోవా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య  అన్నాలెజినోవా శ్రీవారి దర్శనం కోసం  తిరుమల తిరుపతి చేరుకున్నారు. అంతకు ముందు ఆమె గుండుచేయించుకుని, శ్రీవారికి తలనీలాల మొక్కులు కూడా చెల్లించుకున్నారు. సింగపూర్ లో అగ్నిప్రమాదం నుంచి తన తనయుడు మార్క్ శంకర్ బయటపడటంతో  ఆమె తన మొక్కులు చెల్లించుకున్నారు. 

Pawan Kalyan  Wife Anna Lezhneva Offers Hair at Tirumala for Son s Recovery in telugu   JMS

పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా  తిరుమల  శ్రీవారిని దర్శించుకోనున్నారు. సింగపూర్ నుంచి ఇండియా రాగానే, ఆదివారం సాయంత్రం  ఆమె  తిరుమల చేరుకున్నారు. తిరుమల కొండపై గాయత్రి సదనంలో రాత్రి బసచేయబోతున్నారు అన్నా లెజినోవా.  

మొక్కులో భాగంగా  శ్రీనివాసుడికి  తలనీలాలు సమర్పించుకున్నారు అన్నా లెజినోవా. సింగపూర్ లో  తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగి అగ్ని ప్రమాదంలో గాయపడినా, ప్రాణాపాయం నుంచి బయటపడటంతో తిరుమల శ్రీవారిని కుటుంబంతో కలిసి దర్శించుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావించారు.


అన్నా లెజినోవా మతపరంగా క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేశారు అన్నాలేజినోవా. గాయత్రి సదనం లో టిటిడి ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాల పైన సంతకం చేశారు.

ఆతరువాత సాధారణ భక్తుల్లాగానే కళ్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నారు అన్నాలెజినోవా,  పవన్ కళ్యాణ్ భార్య వచ్చారని తెలిసి ఆమెను చూడటానికి భక్తులు ఎగబడ్డారు.  

ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ సతీమణి.. సోమవారం ఉదయం సుప్రభాతసేవలో తన పిల్లలతో కలిసి తిరుమలేశుని  దర్శనం చేసుకోనున్నారు. 
 

Latest Videos

vuukle one pixel image
click me!