రామ్ చరణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చరణ్ స్కూటింగ్ అంతా చెన్నైలోనే జరిగింది. అయితే ఆ స్కూల్‌లో ఎవరికీ తాను చిరంజీవి కొడుకు అని తెలియదట.
తెలిస్తే ఎవరూ తనతో అంత ఫ్రీగా ఉండరని, చిరంజీవి చెప్పనిచ్చేవారు కాదని, తాను కూడా చెప్పేవాడిని కాదని తెలిపారు. అయితే చిరంజీవి స్టడీస్ విషయంలో స్టిక్ట్ గా ఉండేవారు. స్కూల్ టైమ్‌లో సెట్‌కి రానిచ్చేవారు కాదట, కానీ చరణ్‌కి మాత్రం సినిమా షూటింగ్‌లకు రావాలని బాగా ఉండేదట.