ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఇప్పటి వరకు తెలుగులో చాలా మంది స్టార్ హీరోలతో నటించింది. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగచైతన్య, అఖిల్, వరుణ్ తేజ్ వంటి హీరోలతోనూ జోడీ కట్టింది. థియేటర్లలో రచ్చ చేసింది.
పూజా ఎక్కువగా అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్రలే చేసింది. పెద్దగా ప్రయారిటీ లేని రోల్స్ ఆమెకి పడ్డాయి. స్టార్ హీరోలతో సినిమాలంటే సాధారణంగా అలానే ఉంటుంది. హీరోయిన్లకి పెద్దగా స్కోప్ ఉండదు.