ఆ రోజు షూటింగ్ అయిపోయింది. నెక్ట్స్ డే షూటింగ్ లేదు. మరో నాలుగు రోజుల తర్వాత షూటింగ్ ఉంటుంది, బండి పంపిస్తాం వచ్చేయండి అన్నారట దర్శక, నిర్మాతలు. కానీ నాలుగు రోజులు కాదు కదా, పది రోజులైనా బండి రాలేదు. ఏం జరిగిందని కనుక్కుంటే హీరోనే మార్చేశారని తెలిసింది.
దీంతో తాను షాక్‌కి గురయినట్టు తెలిపారు రాజశేఖర్. అలీతో సరదాగా టాక్ షోలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ మూవీలో రాజశేఖర్ పాత్రలో అప్పటి హీరో సురేష్‌ని తీసుకున్నారు.
1985లో ఈ మూవీ విడుదలైంది. బాగానే ఆడింది. కానీ అదే ఏడాది రాజశేఖర్ తెలుగులో `ప్రతిఘటన`, `వందేమాతరం` వంటి బిగ్ బ్లాస్టర్స్ లో భాగమయ్యాడు, ఇక్కడ హీరోగా నిలబడిపోయారు. వరుసగా ఆఫర్లు అందుకున్నారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.