చిరంజీవి గతంలో బాబీ దర్శకత్వంలో వచ్చిన “వాల్తేరు వీరయ్య” భారీ విజయాన్ని నమోదు చేయగా, ఈసారి వారి కాంబినేషన్‌లో మరింత వైవిధ్యమైన కథతో ముందుకు వస్తున్నారు. స్క్రిప్ట్ ప్రస్తుతం రెడీ అవుతోంది. అయితే త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా వెలువడే అవకాశముంది. ఇది చిరంజీవి కెరీర్‌లో కొత్త మలుపు కావొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.