ఎన్టీఆర్‌ ఏడాదికి రెండు సార్లు బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటారు ఎందుకో తెలుసా? తెరవెనుక పెద్ద విషాదం

Published : May 19, 2025, 03:36 PM IST

ఎన్టీఆర్‌ ఏడాదికి రెండు పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. తన రెండో పుట్టిన రోజు వెనుక పెద్ద విషాదం ఉంది. ఆ రహస్యాన్ని తారక్‌ రివీల్‌ చేశారు. 

PREV
16
ఎన్టీఆర్‌ వరుసగా ఏడు విజయాలు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. పదేళ్లుగా కంటిన్యూగా హిట్లు ఇస్తున్న ఏకైక హీరో ఎన్టీఆర్‌ కావడం విశేషం. `టెంపర్‌`తో స్టార్ట్ అయిన ఆయన సక్సెస్‌ పరంపర `నాన్నకు ప్రేమతో`, `జనతా గ్యారేజ్‌`, `జై లవకుశ`, `అరవింద సమేత`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, `దేవర` వరకు కొనసాగుతూనే ఉంది. `దేవర`కి మిశ్రమ స్పందన లభించినా సినిమా మాత్రం మంచి వసూళ్లని రాబట్టింది.

26
ఎన్టీఆర్‌ రెండు సార్లు పుట్టిన రోజు

ఇక రేపు(మే 20) ఎన్టీఆర్‌ తన 42వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. అయితే బర్త్ డే రోజు పెద్దగా హడావుడి ఉండదు. కేవలం ఫ్యామిలీతోనే గడుపుతాడు తారక్. కుదిరితే విదేశాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్‌ చేస్తారు. ఈ సారి కూడా అలాంటి ప్లానే ఉందని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్‌ పుట్టినరోజుకు సంబంధించిన పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఆయన ఏడాదికి రెండు సార్లు బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటారు.

36
భార్య లక్ష్మి ప్రణతి పుట్టిన రోజే ఎన్టీఆర్‌ రెండో బర్త్ డే

తారక్‌ రెండు సార్లు పుట్టిన రోజు జరుపుకోవడం వెనుక పెద్ద విషాదం ఉంది. ఎన్టీఆర్‌ సహజంగా తాన పుట్టిన రోజు మే 20న జరుపుకుంటారు. ఇదంతా నార్మల్‌గానే ఉంటుంది. కానీ అంతకంటే ముందే మరో రోజు ఆయన బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటారు. అది తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజున కావడం విశేషం. ప్రణతి బర్త్ డే మార్చి 26. ఆ రోజు తన ఇంట్లో భార్య ప్రణతితోపాటు ఎన్టీఆర్‌ కూడా కేట్‌ కట్‌ చేస్తాడు.

46
2009 మార్చి 26న ఎన్టీఆర్‌కి పునర్జన్మ

దీనివెనుక ఉన్న విషాదం ఏంటనేది చూస్తే, ఆ రోజు ఎన్టీఆర్‌కి ప్రమాదం జరిగింది. 2009 మార్చి 26న ఎన్నికల ప్రచారంలో పాల్గొని వస్తుండగా తారక్‌ కారు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. చాలా పెద్ద ప్రమాదం అది. దాదాపుగా బతకడం అసాధ్యం అనుకున్నారంతా, కానీ తారక్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. చాలా చోట్ల ఎముకలు విరిగాయి, నడుముకి గట్టి దెబ్బ తగిలింది. ఎన్టీఆర్‌ లేవడం కూడా కష్టమే అనుకున్నారంతా.

56
లక్ష్మి ప్రణతి నా కోసమే పుట్టిందిః ఎన్టీఆర్‌

అలాంటి స్థితి నుంచి ఎన్టీఆర్ కోలుకున్నాడు, మళ్లీ యదావిధిగా నార్మల్‌ వ్యక్తిగా మారిపోయారు, ఫిట్‌ నెస్‌ సాధించాడు. మళ్లీ సినిమాలు చేయడం ప్రారంభించి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. తనకు ప్రమాదం జరిగిన రోజుని ఆయన తాను మళ్లీ పుట్టానని, తనకు అది పునర్జన్మ అని ఎన్టీఆర్‌ భావిస్తున్నారు. అయితే ఆ తర్వాత తన జీవితంలోకి వచ్చిన లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు మార్చి 26నే కావడం విశేషం. ఇది యాదృశ్చికంగా ఉన్నా, దీని వెనుకాల ఏదో శక్తి ఉందని, తన కోసమే ప్రణతి పుట్టిందని ఎన్టీఆర్‌ నమ్ముతాడట. అందుకే ఆమె పుట్టిన రోజు తాను కూడా మళ్లీ పుట్టానని చెప్పి బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసుకుంటాడట తారక్‌. ఇలా తన రెండు పుట్టిన రోజుల వెనుక పెద్ద విషాదం దాగుందని చెప్పొచ్చు.

66
`వార్‌ 2`, `డ్రాగన్‌`ల నుంచి బర్త్ డే ట్రీట్‌

ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`తో పాన్‌ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల `దేవర`తో మంచి విజయాన్ని అందుకున్నారు. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి `వార్‌ 2`లో నటిస్తున్నారు. రేపు ఆయన బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్‌ వచ్చే అవకాశం ఉంది.మరోవైపు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో `డ్రాగన్‌` మూవీలో నటిస్తున్నారు తారక్‌. దీన్నుంచి కూడా ఫస్ట్ లుక్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories