తెలుగు సినీ పరిశ్రమతో పాటు దేశ వ్యాప్తంగా అంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సినిమా రాజమౌళి , మహేష్ బాబు సినిమా. ఈ పాన్ వరల్డ్ మూవీని ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ ‘దుర్గా ఆర్ట్స్’ పతాకంపై రూపొందిస్తున్నారు.
దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు సమాచారం. అమెజాన్ అడవిలో జరిగే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో లేదా 2027 ప్రారంభంలో అయినా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.