116 కుక్కలకు 45 కోట్ల ఆస్తి రాసిచ్చిన బాలీవుడ్ హీరో..? శ్రీదేవితో ఏఫైర్ నడిపిన ఆ నటుడెవరో తెలుసా..?

First Published Jun 19, 2024, 6:09 PM IST

116 కుక్కలు.. వందల కోట్ల ఆస్తి.. కుక్కల కోసమే 45 కోట్లు రాసిచ్చిన హీరో గురించి మీకు తెలుసా..? అవును బాలీవుడ్ ను ఊపు ఊపి వదిలిపెట్టిన ఆహీరో.. ఇప్పుడు రాజకీయాల్లోరాణిస్తుననారు. ఇంతకీ ఎవరాయిన..? 

బాలీవుడ్‌లో జంతు ప్రేమికులు చాలా మంది ఉన్నారు. వారి  సంఖ్యరాను రాను పెరుగుతుంది కూడా..? చాలా మంది కళాకారులు అందమైన కుక్కలను తమతో ఉంచుకుంటారు. కుక్కల వల్ల ఒత్తిడి తగ్గుతుందని.. మానసిక ఆనందం ఉంటుందని చెపుతారు.. . ఈ రోజుల్లో కుక్కలను పెంచనివారంటూ లేదు. అందులో సెలబ్రిటీల చేతుల్లో పెరిగే కుక్కలకు రాజబోగాలు తప్పవు. అయితే ఎవరి ఇంట్లో అయినా.. ఉంటే ఒకట్రెండు కుక్కలు ఉంటాయి.. లేదా డబ్బున్నోల్లు మహాఅయితే ఓ పది కుక్కలు పెంచుతారేమో కాని.. ఓ బాలీవుడ్ నటుడు మాత్రం ఏకంగా 116 కుక్కలు పెంచుతున్నాడు. 

ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ హీరోలు వీళ్లే... తెలుగు హీరోలు ఇందులో ఎవరున్నారంటే..?

అంతే కాదు  ఆ కుక్కలకు కూడా లగ్జరీ లైఫ్ ను రుచి చూపిస్తున్నాడు .. ఈ కుక్కలకు చిన్న చితకా ఇల్లు సరిపోదు కదా.. అందుకే వాటి కోసం అన్ని విలాసవంతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం 45 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాను కూడా  రిజర్వ్ చేసుకున్నాడు. మనం మాట్లాడుకుంటున్న ఈ డాగ్ లవర్ మరెవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి. 

ప్రభాస్ ను బోల్డ్ క్యారెక్టర్ లో చూపించబోతున్న డైరెక్టర్..? రెబల్ స్టార్ ప్రయోగం చేస్తున్నారా..?

మిథున్ చక్రవర్తి డాగ్ లవర్ అంటానికి ఇంత కంటే పెద్ద నిదర్శనం ఇంకేముంటుంది.  నటుడు మిథున్ చక్రవర్తి బాలీవుడ్‌లో  ఎంత పెద్ద స్టారో అందరకి తెలిసిందే కాని ఆయన ఇంత పెద్ద డాగ్ లవర్ అని మాత్రం చాలా తక్కువమందికి తెలుసు. ముంబై మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో తన వివిధ ఆస్తులలో 116 కుక్కలను ఆయన  కలిగి ఉన్నాడు. నివేదికల ప్రకారం, నటుడు ముంబై సమీపంలోని మడ్ ఐలాండ్‌లో తన 1.5 ఎకరాల ఆస్తిలో 76 కుక్కలను పెంచుతున్నాడట. 

రామ్ చరణ్ కు ఉన్న వింత అలవాటు ఏంటో తెలుసా..? మెగాస్టార్ వారసుడు అనిపించుకున్నాడుగా..?

హౌసింగ్.కామ్ ప్రకారం ఆ కుక్కల కోసం కేటాయించిన  ఆస్తి విలువ దాదాపు  45 కోట్లు ఉంటుందని అంచనా.  ఇందులో ఆయన వ్యక్తిగత నివాసం కూడా ఉంది. అయితే, మిథున్ చక్రవర్తి చాలా స్థలాన్ని కుక్కల కోసం కేటాయించారు. మిథున్ తన స్నేహితుడి కుక్కల కోసం కెన్నెల్స్ మరియు ప్లేగ్రౌండ్లను ఏర్పాటు చేశాడు. కుక్కలకు కావాల్సిన అన్ని ఆధునిక సౌకర్యాలు  ఆయన సమకూర్చినట్టు తెలుస్తోంది. 
 

1500 ఫస్ట్ జీతం.. ప్రస్తుతం 15 కోట్లు వసూలు చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

మిథున్ చక్రవర్తి కోడలు నటి మదాల్సా శర్మ గతేడాది ఓ ఇంటర్వ్యూలో కుక్కల గురించి మాట్లాడింది. కుక్కల కోసం ప్రత్యేక గదులు ఉన్నాయి. కుక్కల సంరక్షణకు సిబ్బందిని నియమించారు. కుక్కలను పిల్లల్లాగే చూడాలి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి సమయానికి ఆహారం అందించాలి. కుక్కల సంరక్షణకు ఎక్కువ మంది సిబ్బంది అవసరమని ఈ విషయంలో మిథును ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారోన కూడా ఆమె వివరించింది. 
 

నటుడు మిథున్ చక్రవర్తి ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగు వెలిగారు. అయితే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే టైమ్ కు ఆయన పేదవారు.  అతని దగ్గర అంత డబ్బు లేదు. ఇల్లు కూడా సరిగ్గా లేని కుటుంబం నుంచి ఆయన వచ్చారు. సినిమా అవకాశా కోసం చూస్తు.. మిథున్ చక్రవర్తి రైల్వే స్టేషన్, ఫుట్‌ఫాత్‌ ల పైన   నిద్రపోయి... ఈ స్థాయికి ఎదిగారు. 

మిథున్ చక్రవర్తి తెలుగులో కూడా నటించారు. వెంకటేష్‌, పవన్ కళ్యాణ్ కలిసి నటించి గోపాల గోపాల మూవీలో మెయిన్ విలన్ గా నటించి మెప్పించారు. ఒక్క అవకాశంతో తనేంటో నిరూపించుకున్న మిథున్..  తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మిథున్ కోటీశ్వరుడు. మిథున్‌కు దాదాపు 400 కోట్ల ఆస్తి ఉంది. మిథున్‌కు భారతదేశంలో దాదాపు వంద కొద్ది స్థిరాస్తులు కలిగి ఉన్నాడట. . ఊటీలోని మడ్ ఐలాండ్‌లో మిథున్‌కు ఇల్లు కూడా ఉంది. అనేక హోటళ్లు మరియు కాటేజీల యజమాని కూడా. ముంబైకి సమీపంలో ఫామ్ హౌస్ ఉన్న మిథున్ చక్రవర్తికి మైసూర్‌లో కూడా భారీగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం.   
 

అయితే  మిథున్ చక్రవర్తి యోగితా బాలిని వివాహం చేసుకున్నారు. ఆతరువాత శ్రీదేవిని  కూడా పెళ్ళాడారు అని అప్పట్లో టాక్ ఉంది. కాని అందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక  మిథున్ చక్రవర్తికి నలుగురు పిల్లల ఉండగా..  చెత్త కుండీలో పడి ఉన్న చిన్నారిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశారు. ఇక మిథున్ నటనతోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ  మంచివాడిగా.. సౌమ్యుడిగా.. వివాదా రహితుడిగా పేరు తెచ్చుకున్నారు. 

Latest Videos

click me!