`జబర్దస్త్` మోస్ట్ పాపులర్ కామెడీ షో. పదేళ్లుగా నాన్ స్టాప్‌గా నవ్వులు పూయిస్తూనే ఉంది. అయితే ఇటీవల ఆ కామెడీ డోస్ తగ్గిందని చెప్పి, ఓ షోనే లేపేశారు నిర్వాహకులు. ఎక్స్ ట్రా జబర్దస్త్ ని తొలగించి, కేవలం జబర్దస్త్ షోనే రెండు ఎపిసోడ్లుగా ప్రసారం చేస్తున్నారు. గురు, శుక్రకి బదులు, శుక్రవారం, శనివారం టెలికాస్ట్ చేస్తున్నారు. జడ్జ్ ఇంద్రజ వెళ్లిపోయారు. టీమ్‌లు కుదించారు. ఆరు టీముల్లో కమెడియన్లని అడ్జెస్ట్ చేశారు. కాంపిటీషన్ బాగాపెరిగింది.