సుడిగాలి సుధీర్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న RRR సింగర్ తండ్రి.. మా వెనుక ఎవరూ లేరు అంటూ..

First Published Jun 19, 2024, 5:17 PM IST

సుధీర్ యాంకర్ గా, హోస్ట్ గా పలు షోలు చేస్తున్నాడు. అందులో ఒకటి ఫ్యామిలీ స్టార్స్. శ్రీదేవి డ్రామా కంపెనీ తరహాలో సరదాగా సాగే ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. 

హీరోగా ఎదగాలని సుడిగాలి సుధీర్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. సుధీర్ కి బుల్లితెరపై ఆల్రెడీ క్రేజ్ వచ్చింది. స్టైలిష్ లుక్స్ ఉండడంతో హీరోగా పనికొస్తాడనే కామెంట్స్ వినిపించాయి. సుధీర్ వరుసగా హీరోగా చిత్రాలు చేస్తున్నాడు కానీ హిట్స్ పడడం లేదు. 

సుధీర్ ప్లాన్ బి అన్నట్లుగా తనకి గుర్తింపు తెచ్చిన బుల్లితెరని వదలడం లేదు. ఇప్పటికే సుధీర్ యాంకర్ గా, హోస్ట్ గా పలు షోలు చేస్తున్నాడు. అందులో ఒకటి ఫ్యామిలీ స్టార్స్. శ్రీదేవి డ్రామా కంపెనీ తరహాలో సరదాగా సాగే ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. 

లేటెస్ట్ ప్రోమోలో కమెడియన్ రియాజ్, భానుశ్రీ, యాంకర్ స్రవంతి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. స్రవంతి, భానుశ్రీ ఇద్దరూ సుధీర్ ఫోటో పట్టుకుని రియాజ్ వద్దకు వెళుతారు. బావకి ఏమంటే ఇష్టం అని అడుగుతారు. దీనికి రియాజ్ పులిహోర అంటే ఇష్టం అని చెప్పి నవ్వులు పూయిస్తాడు. 

ఈ షోకి కొందరు బాల గాయకులని ఆహ్వానించారు. రియాజ్, సుడిగాలి సుధీర్, స్రవంతి, భానుశ్రీ మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వాళ్ళు పెర్ఫామ్ చేసిన స్కిట్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రియాజ్ తన కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. 

అలాగే ఒక ఎమోషనల్ సంఘటన కూడా చోటు చేసుకుంది. ఈ షోకి ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎంతో మధురంగా కొమ్మా ఉయ్యాలా అనే సాంగ్ పాడిన చిన్నారి ప్రకృతి కూడా హాజరైంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. సింగర్ ప్రకృతి తండ్రి సాధారణ రైతు. అయినప్పటికీ తన కుమార్తెని సింగర్ ని చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో పాట పాడేలా చేశారు అంటూ సుధీర్ అభినందించారు. 

సుధీర్ మాటలకు ప్రకృతి తండ్రి ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీలో మాకు ఎవరూ తెలియదు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా ప్రకృతి ఇంత గుర్తింపు తెచుకున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. కీరవాణి గతంలోనే చిన్నారి ప్రకృతి గాత్రాన్ని అభినందించారు. 

Latest Videos

click me!