Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో కామన్ మ్యాన్ .. ఉన్నట్టా లేనట్టా..?

First Published | Aug 31, 2024, 10:59 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఈసారి ఎంటర్ అయ్యే కామన్ మెన్ ఎవరు..? అసలు కామన్ మెన్ కాన్నెప్ట్ ఈసారి ఉంచుతారా లేదా.. ? కామన్ మ్యాన్ కాన్సెప్ట్ వల్ల బిగ్ బాస్ కు జరిగిన నష్టం ఏంటి..? 

Bigg Boss telugu season 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టార్ట్ కాకముందు నుంచే ఎంతో ఉత్కంఠను రేపుతోంది. కంటెస్టెంట్స్ విషయంలో గత సీజన్ల కంటే క్యూరియాసిటీమరీ ఎక్కువగా పెరుగుతోంది. ఈసారి సీజన్ లో సర్ ప్రైజీంగ్ కంటెస్టెంట్స్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే రకరకాల పేర్లు ఇప్పటికే నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి. వారిలో చాలామంది దాదాపు కన్ ఫార్మ్ అయినట్టు సమాచారం. 

Al so Read: Bigg Boss telugu 8: బిగ్ బాస్ హౌస్ లో లో బోరుమని ఏడ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే...?

Bigg Boss Telugu Season 8

అయితే ప్రతీ సీజన్ లో ఉన్నట్టే.. ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీ స్టార్స్ తో పాటు.. కామన్ మ్యాన్ కాన్సెప్ట్ ఉంటుందా..? ఒక వేళ ఉంటే.. ఈసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే కామన్ మ్యాన్ ఎవరు..? తెలుగు బిగ్ బాస్ టీమ్ ప్రవేశపెట్టిన కామన్ మ్యాన్ కాన్సెప్ట్ వల్ల బిగ్ బాస్ కు గట్టి దెబ్బ తగిలిందనేది అందరికి తెలిసిన విషయమే.. మరి అంత జరిగినా ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ ను తీసుకువస్తారా..? ఈసారి కామన్ మాన్ కాన్సెప్ట్ కు మంగళంపాడలని బిగ్ బాస్ టీమ్ అనుకుంటున్నారట. దానికి కారణం ఏంటి...? 

Al so Read: బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని కెమెరాలు ఉంటాయి..? ఆ ఒక్క ప్లేస్ లో మాత్రం ఎందుకు పెట్టరు...?


Bigg Boss Telugu

ప్రతీ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలుపుకుని  15 నుంచి 20 మంది వరకూ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తుంటారు. ఈ20 మంది కంటెస్టెంట్స్ రకరకాల రంగాల నుంచి వస్తుంటారు. మరీ ముఖ్యంగా సినిమా, సీరియల్, సోషల్ మీడియా, టీవీ, రంగాల నుంచి  ఎక్కవగా సెలబ్రిటీలు హౌస్ లో సందడి చేయడం మనం చూస్తుంటాం. అయితే వీరితో పాటు కామన్ మ్యాన్ కాన్సెప్ట్ తో సెకండ్ సీజన్ నుంచి ఓ కొత్త కాన్సెప్ట్ ను ప్రవేశ పెట్టారు తెలుగు బిగ్ బాస్ టీమ్.

Al so Read: బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ప్రెగ్నెంట్ అయితే ..? ఓ సారి ఏం జరిగిదంటే..? 

Bigg Boss Telugu

అయితే ఇలా కామన్ మ్యాన్ కాన్సెప్ట్ ను బిగ్ బాస్ 2 నుంచి స్టార్ట్ అయ్యింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 2 లో కామన్ మ్యాన్ గా గణేష్ అనే కుర్రాడు ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు. ఆసీజన్ మీద ఎన్ని మివమర్శలు వచ్చినా.. కామన్ మెన్ కాన్సెప్ట్ మాత్రం అప్పుడు బాగానే వర్కౌట్ య్యింది. దాంతో తరువాత సీజన్ లో నూతన్ నాయుడు.. ఆతరువాత ఆదిరెడ్డి, లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్  ను కామన్ మ్యాన్ కాన్సెప్ట్ లో హౌస్ లోకి తీసుకువచ్చారు. 

Al so Read: బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ క్రికెటర్.. తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..? ఎవరతను..?

Bigg Boss Telugu 7

నిజానికి గణేష్ తప్పటించి మిగిలిన వారు కామన్ మ్యాన్ అనడానికి లేదు. ఎందుకుంటే ఆదిరెడ్డి, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లోకి వచ్చేప్పటికే యూట్యూబ్ స్టార్స్ గా ఉన్నారు. ఇక పల్లవి ప్రశాంత్ అయితే..బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా అమర్  తో ప్రశాంత్ గొడవలు తారాస్థాయికి వెళ్ళాయి..ఇద్దరు యుద్దాలే చేసుకున్నారు. ఇక కామన్ మ్యాన్ పేరుతో హౌస్ లోకి వచ్చిన ప్రశాంత్.. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ కూడా గెలుచుకున్నాడు. 

Bigg boss telugu 8

అయితే గెలిచిన తరువాత అమర్ కుటుంబంపై.. పల్లవి ప్రశాంత్ అనుచరులు చేసిన వ్యాఖ్యలు.. దాడులు, ఆకరికి ప్రశాంత్ జైలుకు వెళ్ళేలా చేశాయి. దాంతో కామన్ మెన్ కాన్సెప్ట్ రచ్చ రచ్చ అయ్యింది. బిగ్ బాస్ పరువు పోయినట్టు అయ్యింది. పల్లవి ప్రశాంత్ ఇష్యూ వల్ల.. ఈసారి కామన్ మ్యాన్ కాన్సెప్ట్ కు మంగళం పాడే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ టీమ్. ప్రశాంత్ దెబ్బతో కామన్ మెన్ అవకాశాన్ని కోల్పోయాడని చెప్పవచ్చు. మరి చూడాలి కంటెస్టెంట్స్ లిస్ట్ రిలీజ్ అయ్యే వరకూ.. ఎవరెవరు హౌస్ లోకి వెళ్ళబోతున్నారు అనేది సస్పెన్స్ అనే చెప్పాలి. 

Latest Videos

click me!