ఇక ప్రతీ సీజన్ లో ఇలా బాగా ఏడ్చేవారు లేకపోలేదు. బిగ్ బాస్ సీజన్ 5 లో బాగా ఎమోషనల్ అయిన వారిలో ప్రియాంకసింగ్ టాప్ లో ఉన్నారు. ఆమె బిగ్ బాస్ సీజన్ 5 లో ఎక్కువగా ఏడ్చిన పర్సన్ గా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా మానస్ తో తన రిలేషన్ విషయంలో బాగా బాధపడుతూ.. ఏడుస్తూ కనిపించిన ప్రియాంకసింగ్.. తన తండ్రికి తాను ట్రాన్స్ జెండర్ అని బిగ్ బాస్ ద్వారా తెలిసి.. ఆయన యాక్సప్ట్ చేసిన తరువాత ఏడుపు ఆపుకోలేకపోయింది ప్రియాంక. తన తండ్రి వీడియోను చూసి బోరున ఏడ్చింది.