ఇక బిగ్ బాస్ హౌస్ లో 60 కెమెరాలు ఉంటాయట. వాటిని నిత్యం మానటరింగ్ చేయడానికి పీసీఆర్ నుంచి షిఫ్ట్ వైజ్ గా ఎంప్లైయిస్ పనిచేస్తుంటారు. ఎప్పుడు ఏం జరిగినా.. వెంటనే స్పందించే విధంగా కెమెరాల ద్వారా చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లో జరిగే ఈవెంట్స్ కాని, గేమ్స్ కాని.. ఎమెషనల్ మూమెంట్స్ ఏమున్నా సరే కెమెరా వెంటనే క్యాప్చర్ చేస్తుంటుంది. ఏపనిచేసినా సరే కెమెరా కళ్ళ నుంచి తప్పించుకోవడం అసాధ్యమనేచెపపాలి. అన్ని వైపులా.. చిన్న చిన్న మూలలు కూడా కవర్ చేస్తూ.. కెమెరాలు పనిచేస్తుంటాయి.