Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ తెలుగు 9 లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. తన మైండ్ గేమ్స్, డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే.. మొదటి వారం ఎలిమినేషన్ లో హౌస్ నుంచి బయటకు వచ్చేదెవరు? అనేది ఉత్కంఠగా మారింది.
బిగ్ బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న గ్రాండ్ ప్రీమియర్ ఘనంగా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ ప్రత్యేకత ఏమిటంటే, తొలిసారిగా సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కామనర్స్ హౌస్ ఓనర్స్‌గా, సెలబ్రిటీలు టెనెంట్స్‌గా హౌస్‌లో అడుగుపెట్టారు. రెండు వేర్వేరు హౌస్‌లలో కంటెస్టెంట్లను పెట్టి, వారిమధ్య వ్యూహాలు, ఘర్షణలు మొదటి నుంచే హాట్ టాపిక్ అయ్యాయి. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు షోలో పాల్గొంటుండగా, వారిలో ఐదుగురు కామనర్స్ బిగ్ బాస్ అగ్నిపరిక్ష ద్వారా హౌస్‌లోకి రావడం మరింత ఆసక్తిని రేకెత్తించింది.
25
మొదటి వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?
బిగ్ బాస్ తొలివారం నామినేషన్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్‌కు బలయ్యారు. వారిలో తనుజ గౌడ, సుమన్ శెట్టి, జబర్దస్త్ ఇమాన్యుయేల్, డీమన్ పవన్, సంజనా గల్రాని, రాము రాథోడ్, రీతు చౌదరి, ఫ్లోరా సైనీ, శ్రేష్టి వర్మ ఉన్నారు. మొదట వీరిలో ఎవరెవరు సేఫ్ అవుతారు? ఎవరెవరు ఎలిమినేషన్ అవుతారు? అనేది బిగ్ బాస్ లవర్స్ లో ఉత్కంఠ పెంచుతుంది. అయితే ఓటింగ్ ప్యాటర్న్స్ గేమ్‌ను పూర్తిగా మార్చేశాయి.
35
ఓటింగ్ ట్రెండ్స్ – ఎవరు సేఫ్?
ప్రస్తుతం ఉన్న బిగ్ బిగ్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం.. ముద్దమందారం ఫేమ్ తనుజ గౌడ టాప్ లో దూసుకపోతుంది. సోషల్ మీడియా పోల్స్‌లో అత్యధికంగా 26 శాతం ఓట్లు సాధించి సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. ఆమెకు టీవీ ఫ్యాన్స్ సపోర్ట్ ఉండటంతో ఎలిమినేషన్ నుంచి బయటపడింది.
ఎవరు ఊహించని విధంగా కామెడియన్ సుమన్ షెట్టి 19 శాతం ఓటింగ్ తో దూసుకెళ్లడం బిగ్ ట్విస్ట్‌గా మారింది. ఇది ఆయనకు ఉన్న కమెడియన్ ఇమేజ్, అలాగే హౌస్‌లోని సింపుల్ ప్రవర్తన కారణంగా ఇలా సాధ్యమైంది. ఇక జబర్దస్త్ ఇమాన్యుయేల్ 16 శాతం, డిమోన్ పవన్ 10 శాతం ఓట్లు పొందినట్టు తెలుస్తోంది. పై నలుగురు కంటెస్టెంట్లు మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నారని చెప్పావచ్చు.
మరోవైపు ఎప్పటి నుంచీ నెగటివ్ కామెంట్స్‌తో, బ్యాక్‌బిచ్చింగ్ కారణంగా అందరికీ చిరాకు తెప్పించిన సంజన గల్రాని బయటకు వెళ్తారని అనుకున్నారు. కానీ ఆమె ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు సాధించి ప్రస్తుతం సేఫ్ జోన్‌లోకి ఉన్నట్లు తెలుస్తుంది.
సోషల్ మీడియా పోల్స్ ప్రకారం చూస్తే.. ప్రస్తుతం ఎలిమినేషన్ డేంజర్ జోన్‌లో శ్రష్టి వర్మ 3 శాతం, ఫ్లోరా సైనీ 3 శాతం ఓట్లతో చివరి స్థానంలో ఉండగా, రీతు చౌదరి 5 శాతం, రాము రాథోడ్ 8 శాతం ఓట్లు సాధించి బాటమ్‌లో ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరు మొదటి వారం ఎలిమినేట్ కావచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు.
55
కెప్టెన్సీ టాస్క్
అదే సమయంలో హౌస్‌లో మొదటి వారంలోనే కెప్టెన్సీ టాస్క్ మొదలవడం గేమ్‌ను కొత్త మలుపులోకి తీసుకెళ్లింది. కెప్టెన్‌గా ఎవరైతే ఎంపిక అవుతారో వారు తరువాతి వారం నామినేషన్‌ల నుంచి బయటపడే పవర్ పొందుతారు. ఇది కంటెస్టెంట్లకు పెద్ద వరం లాంటి. అందువల్ల టాస్క్‌లో పోటీ మరింత హీటెక్కింది.
ఈ వీకెండ్‌లో నాగార్జున వేదికపైకి వచ్చి కంటెస్టెంట్ల గేమ్‌పై క్లాస్ తీసుకోబోతున్నారు. ఎవరు నిజంగా గేమ్ ఆడుతున్నారు, ఎవరు వీక్ గా ఆడుతున్నారనేది ఆయన మాటల్లో స్పష్టమవుతుంది. అలాగే మొదటి ఎలిమినేషన్ లో ఎవరు? బలవుతారనేది? ఉత్కంఠగా మారింది.