Rajamouli : ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా వెలుగు వెలుగుతున్న యంగ్ టైడర్ ఎన్టీఆర్ ను చండాలంగా ఉన్నావ్ అని తిట్టిన దర్శకుడు ఎవరో తెలుసా? అసలు ఆ మాట ఎందుకు అన్నాడు? కారణం ఏంటి? ఎవరా దర్శకుడు? ఎన్టీఆర్ స్వయంగా చెప్పిన నిజం.
జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ , దేవర సినిమాలతో పాన్ ఇండియా హీరోగా రూసుకుపోతున్నాడు తారక్. రీసెంట్ గా వచ్చిన వార్ 2 పెద్దగా ప్రభావం చూపించకపోయినా.. త్వరలో రాబోతున్న డ్రాగన్ పై అభిమానుల ఆశలన్నీ పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈసినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలుఉన్నాయి, అవి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈసినిమా నుంచి ఏవైనా అప్ డేట్స్ వస్తే హైప్ పీక్స్ కు వెళ్లే అవకాశం లేకపోలేదు. ఇక ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ ను చాలా చేంజ్ చేసుకున్నాడు. ఈక్రమంలో చాలా వెయిట్ లాస్ అయిన తారక్ ను చూసి ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. ఇలా అయిపోయాడేంటి అని అంతా అనుకున్నారు. ఎన్టీఆర్ కు లుక్ చేంజ్ చేసుకోవడం అలవాటే.
26
గతంలో జూనియర్ ఎన్టీఆర్
గతంలో ఎన్టీఆర్ ఎలా ఉండేవారో అందకి తెలుసు. యమదొంగ సినిమాకు ముందు వరకూ ఎన్టీఆర్ చాలా వెయిట్ ఉండేవారు. అయినా సరే సింహాద్రీ లాంటి సినిమాలతో ఆయన ఇమేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఈక్రమంలోనే ఎన్టీఆర్ లుక్ ను విమర్శిస్తూ ఓ దర్శకుడు చండాలంగా ఉన్నావ్ అని అన్నారట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు రాజమౌళి. ఎన్టీఆర్ ను ఏదైనా అనేంత దైర్యం ఆయనకు కాక మరెవరికి ఉంటుంది. ఎన్టీఆర్ తో అప్పటికే రెండు సినిమాలు చేసిన రాజమౌళి, ముచ్చటగా మూడో సినిమాగా యమదొంగను ప్లాన్ చేస్తున్న టైమ్ లో ఓ సంఘటన జరిగింది.
36
యమదొంగ టైమ్ లో పూర్తిగా మారిపోయిన తారక్
ఈసినిమా కోసం చాలా ప్లాన్స్ చేశారు జక్కన్న. అందుకోసం ఎన్టీఆర్ లుక్ ను కంప్లీట్ గా మార్చేయాలి అనుకున్నారట. ఆ విషయం తారక్ కు డైరెక్ట్ గా చెప్పారట రాజమౌళి. తారక్ నీ లుక్ చేంజ్ చేయాలి, చాలా చండాలంగా ఉన్నారు మీరు. అని అన్నారట. దాంతో అదేంటి జక్కన్న ఈ లుక్ తోనే కదా సింహాద్రి లాంటి హిట్స్ ఇచ్చావు.. ఇప్పుడు ఇలా అంటావేంటి అని ఎన్టీఆర్ అన్నారు. దాంతో లేదు బయట ఓ సెక్టార్ ఆడియన్స్ మీ సినిమాను చూడటం మానేశారు. అందుకే మీ లుక్ మారిపోవాలి. ఈసారి డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని రాజమౌళి అన్నారట. దాంతో అప్పటి నుంచి ఎన్టీఆర్ కష్టపడి, షూటింగ్ టైమ్ కు కంప్లీట్ గా మేకోవర్ అయ్యాడు. భారీగా వెయిట్ తగ్గి చూపించాడు. అలా జక్కన్న మాత్రమే ఎన్టీఆర్ ను ముఖం మీదే అడగే స్నేహం కలిగి ఉన్నాడు, ఆ ధైర్యం కూడా ఆయనకే ఉంది.
ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా బిజీలో ఉన్నాడు. ఈసినిమాతో టాలీవుడ్ ను హాలీవుడ్ లో కూడా నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు రాజమౌళి. ఇప్పటికే బాలీవుడ్,కోలీవుడ్ లను పక్కను కూర్చోబెట్టి, ఇండియాన్ సినిమా అంటే టాలీవుడ్ అనే రేంజ్ కు తెలుగు పరిశ్రమను తీసుకెళ్లాడు రాజమౌళి. మరి మహేష్ బాబుతో తెరకెక్కిస్తోన్న అడ్వెంచర్ మూవీతో జక్కన్న ఏం చేయబోతున్నాడో చూడాలి.
56
ఎన్టీఆర్ తో రాజమౌళి స్నేహం
ఎన్టీఆర్ తో రాజమౌళి స్నేహం ఇప్పటిది కాదు. రాజమౌళి ఫస్ట్ సినిమా, ఎన్టీఆర్ కు ఫస్ట్ హిట్ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్. ఈసినిమా నుంచి వీరి ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది. జక్కన్న తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేసింది కూడా ఎన్టీఆర్ తోనే. వీరి కాంబినేషన్ లో స్టూడెంట్ నెంబర్ వన్ తో పాటు సింహాద్రీ, యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలు వచ్చాయి. ఆతరువాత స్థానంలో ప్రభాస్ ఉన్నారు.
66
ఎన్టీఆర్ సినిమాలు
ఇక ఎన్టీఆర్ మాత్రం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. దేవర హిట్ తరువాత బాలీవుడ్ లో అడుగు పెట్టిన తారక్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 లో నటించారు. ఈసినిమాకు తెలుగులో కూడా భారీగా పబ్లిసిటీ ఇచ్చారు. కాని అది వర్కౌట్ అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాపై దృష్టి పెట్టిన ఎన్టీఆర్, ఆతరువాత దేవర పార్ట్ 2 లో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఆతరువాత క్యూలో సందీప్ రెడ్డి వంగ, త్రివిక్రమ్ లాంటి దర్శకులు ఉన్నట్టు సమాచారం.