బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంచింగ్ ప్రోమో వచ్చేసింది, హౌస్ లోకి వచ్చేవారు ఎవరెవరంటే?

Published : Sep 07, 2025, 11:29 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్ కు రెడీ అయ్యింది. ఈరోజు జరగబోయే ప్రారంభోత్సవానికి సబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు టీమ్. ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ అవుతోంది.

PREV
16

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు తారాస్థాయిలో ఉన్న వేళ, షో మేకర్స్ తాజాగా విడుదల చేసిన ప్రోమో ఈ ఆసక్తిని మరింత పెంచింది. 'డబుల్ హౌస్... డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్' అంటూ విడుదలైన ఈ ప్రోమోలో నాగార్జున స్టైల్, హౌస్ గ్రాండ్ లుక్, కొత్త కంటెస్టెంట్లపై సస్పెన్స్‌తో ప్రేక్షకులలో ఉత్కంఠను రేపుతోంది.

26

ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 7, ఆదివారం సాయంత్రం 7 గంటలకు జరుగనుంది. మేకర్స్ రిలీజ్ చేసిన 2 నిమిషాల 29 సెకన్ల ప్రోమోలో కొన్ని ముఖ్యమైన విషయాలు కనిపించాయి. ముఖ్యంగా ఈసారి బిగ్ బాస్ హౌస్ డబుల్ స్టైల్‌లో ఉండనుందనే సంకేతాలు ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు.

36

ప్రోమో మొదట్లో నాగార్జున గళంలో, “ఊహకందని మార్పులు… ఊహించని మలుపులు… డబుల్ హౌస్‌తో, డబుల్ జోష్‌తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9,” అనే డైలాగ్‌తో ప్రారంభమైంది. సింపుల్ గ్లామర్‌తో, ఫుల్ స్టైల్‌లో నాగార్జున ఎంట్రీ ఇవ్వడం, ప్రేక్షకులకి విజువల్ ట్రీట్ లా మారింది.

46

కంటెస్టెంట్లను అయితే ఎప్పటిలానే ఫేస్ రివీల్ చేయకుండా చూపించడం ప్రోమోలో ఆసక్తిని రెట్టింపు చేసింది. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ suitcase పట్టుకుని నడుస్తూ కనిపించడం, "ఇందు వదనా, సుందర వదనా వావ్" అనే చిరంజీవి శైలిలోని డైలాగ్ వాయిస్‌ ఓ హింట్‌ను ఇచ్చింది. అతను కచ్చితంగా ఇమ్మాన్యుయేల్ అనే ఊహలు నెట్టింట్లో ఊపందుకున్నాయి.

56

ఆశా శైనీ "పిక్చర్ అబీ బాకీ హై" అనే డైలాగ్ చెప్పడం, సీరియల్ నటుడు భరణి హాకీ స్టిక్‌తో కనిపించడం వల్ల, వీరే కొత్త కంటెస్టెంట్లా అనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.ఒక కంటెస్టెంట్ బాక్స్ పట్టుకుని హౌస్‌లోకి వెళ్లే ప్రయత్నంలో ఉంటాడు. నాగార్జున అడిగినపుడు, "ఇది నా బాడీలో భాగం" అంటూ బిగ్ బాస్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. అయితే బిగ్ బాస్ అనుమతించకపోవడంతో, ఆ కంటెస్టెంట్ హౌస్‌లోకి వెళ్లకుండా సెల్ఫ్ ఎలిమినేట్ అవుతాడు. దీనికి నాగార్జున స్పందిస్తూ, “నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు. కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి కాదు,” అంటాడు.

66

ఇక కామనర్స్ విభాగంలో పాల్గొంటున్న కల్కి, దాలియా వంటి వ్యక్తులతో నాగార్జున జరిపిన సరదా సంభాషణలు నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. మరి ఈ సీజన్‌లో బిగ్ బాస్ కొత్త ఫార్మాట్, డబుల్ హౌస్ కాన్సెప్ట్, రివీల్స్ కాకుండా చూపిన ప్రెజెంటేషన్‌తో, ఈ ప్రోమో బిగ్ బాస్ లాంచింగ్ ప్రోగ్రామ్ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories