ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న హారర్ థ్రిల్లర్ కామెడీ చిత్రం 'ది రాజా సాబ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా 2025 డిసెంబర్లో, క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.ఇకపోతే, 'ది రాజా సాబ్'తో పాటు ప్రభాస్ చేతిలో స్పిరిట్, ఫౌజీ, సలార్ 2, కల్కి 2 సినిమాలు ఉన్నాయి. గతేడాది విడుదలైన కల్కి 2898 ఏ.డి. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ప్రభాస్ హవా మరింతగా పెరిగింది.