మహేష్, కృష్ణ కాంబోలో మిస్ అయిన ఇండస్ట్రీ హిట్ మూవీ ? అల్లు అరవింద్ పంట పండింది, అది కూడా చిరు ఖాతాలోనే

Published : Sep 07, 2025, 10:43 AM IST

ఖైదీ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మరో ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని వదులుకున్నారు. ఆ మూవీ కూడా చిరంజీవి ఖాతాలోనే పడింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

PREV
15

సూపర్ స్టార్ కృష్ణ 80 వ దశకంలో వరుస చిత్రాలు చేస్తూ అప్పటి కుర్ర హీరోలకు పోటీగా నిలిచారు. కృష్ణ ఒకే ఏడాది పదుల సంఖ్యలో సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో బిజీగా ఉండడం వల్ల కృష్ణ చాలా చిత్రాలు రిజెక్ట్ చేయాల్సి వచ్చేది. చిరంజీవి కెరీర్ మలుపు తిప్పిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ఖైదీలో ముందుగా నటించే అవకాశం కృష్ణకి దక్కింది. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రాన్ని కృష్ణ వదులుకున్నారు. 

25

నాలుగేళ్ళ తర్వాత మరో ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని కృష్ణ చేజార్చుకున్నారు. విశేషం ఏంటంటే ఆ చిత్రం కూడా చిరంజీవి చేతుల్లోకే వెళ్ళింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో వివరాల్లో తెలుసుకుందాం. 1987లో చిరంజీవి, విజయశాంతి హీరో హీరోయిన్లుగా పసివాడి ప్రాణం చిత్రం రూపొందింది. కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటి ప్రముఖ నటి సుజిత చైల్డ్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలో నటించారు. 

35

అప్పట్లో హాలీవుడ్ లో విట్నెస్ అనే మూవీ తెరకెక్కింది. ఆ చిత్రం ఆధారంగా కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్ లో ఒక చిత్రం ప్రారంభం అయింది. ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రకి కృష్ణ తన కొడుకు మహేష్ బాబుని ఎంచుకున్నారు. ఆ చిత్రానికి విజయ బాపినీడు దర్శకుడు. విట్నెస్ ఆధారంగా మలయాళం, తమిళంలో సినిమాలు రూపొందాయి. ఆ రీమేక్ రైట్స్ అల్లు అరవింద్ కొన్నారు. వెంటనే చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో పసివాడి ప్రాణం చిత్రం ప్రారంభం అయింది. 

45

రెండు చిత్రాల కథలు ఒకటే అని కృష్ణకి తెలియడంతో ఆయన ఆ మూవీ నుంచి తప్పుకున్నారు. దీనితో చిరంజీవి, అల్లు అరవింద్ లకు లైన్ క్లియర్ అయింది. అద్భుతమైన పాటలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్ తో కూడిన కథ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఫలితంగా పసివాడి ప్రాణం చిత్రం చిరంజీవి కెరీర్ లో ఖైదీ తర్వాత రెండవ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పట్లో ఏ తెలుగు చిత్రానికి సాధ్యం కానీ విధంగా 5 కోట్ల షేర్ దగ్గర్లోకి వెళ్ళింది ఈ చిత్రం. నిర్మాతగా అల్లు అరవింద్ కి కూడా ఇదే తొలి ఇండస్ట్రీ హిట్. 

55

ఈ మూవీ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. చిరంజీవి కెరీర్ లో తొలి సిల్వర్ జూబ్లీ మూవీగా నిలిచిన పసివాడి ప్రాణం పలు కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శించబడింది. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు. 

Read more Photos on
click me!

Recommended Stories