హరిత హరీష్ భార్య తన భర్తని పవన్ కళ్యాణ్ తో పోల్చడం కరెక్టేనా ? ఈ మూడు ప్రశ్నలకు మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్

Published : Oct 08, 2025, 01:58 PM IST

అగ్ని పరీక్ష నుంచి హరీష్ మాస్క్ మాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. హరీష్ ఎక్కువగా నెగిటివిటీ వల్ల ఎలిమినేట్ అయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై హరిత హరీష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో ప్రారంభమై నెల రోజులు పూర్తయింది. ప్రస్తుతం ఐదవ వారం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి.. చివరగా హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు. అగ్ని పరీక్ష నుంచి హరిత హరీష్ మంచి అటెన్షన్ పొందారు. తన రెబల్ యాటిట్యూడ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు.

25
హరిత హరీష్ పై నెగిటివిటీ 

చివరి రెండు వారాలు హరీష్ టాస్క్ లలో పాల్గొనడం తగ్గించారు. దీనికి తోడు సంజన లాంటి వారితో హరీష్ కి ఎక్కువగా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా అటెన్షన్ తో పాటు హరీష్ పై నెగిటివిటీ కూడా పెరుగుతూనే వచ్చింది. దీనితో హరీష్ ఎలిమినేట్ అయ్యారు. బయటకి వచ్చాక హరీష్ మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. ఆయన సతీమణి హరిత కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో హరిత తన భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

35
హరిత హరీష్ భార్య కామెంట్స్ 

తన భర్తను ఆమె ఏకంగా పవన్ కళ్యాణ్ తో పోల్చింది. హరిత హరీష్ పై ఎక్కువ నెగిటివిటీ వచ్చింది కదా అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి హరిత బదులిస్తూ ఆయనపై నెగిటివిటి వచ్చింది అనేది కరెక్ట్ కాదు. ఆయన బిగ్ బాస్ జర్నీ పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఆయన తన నేచర్ కోల్పోకుండా షోలో పెర్ఫామ్ చేశారు. ఈ రోజుల్లో ఎథిక్స్, మోరల్స్ ఎంతమంది ఫాలో అవుతారో తెలియదు. నా భర్త అవి ఫాలో అవుతారు. ఎథిక్స్ ఫాలో అయ్యే వారికి నెగిటివిటి తప్పదు. కొన్ని సిద్ధాంతాలు నమ్మి బ్రతికేవాళ్లు ఉంటారు. సరైన ఉదాహరణ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు.. ఆయనకే నెగిటివిటి తప్పలేదు. ఇక మనమెంత అని హరిత హరీష్ అన్నారు. 

45
తన భర్తని పవన్ కళ్యాణ్ తో పోల్చిన హరిత

హరిత తన భర్తని ఆ విధంగా పవన్ కళ్యాణ్ తో పోల్చారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ షోకి ఆయన ఎలాంటి ప్లానింగ్ తో వెళ్ళలేదు. కానీ షో అంటే ఆయనకి ఐడియా ఉంది, అలాగే ఇష్టం కూడా. అగ్ని పరీక్షకి ముందు జరిగిన ఒక సంఘటన రివీల్ చేస్తాను. ముందుగా అగ్ని పరీక్షకి ఎంపిక చేయడానికి ఒక ఆడిషన్ వీడియో పంపమని బిగ్ బాస్ నిర్వాహకులు అడిగారు. అందులో ఆయన సెలెక్ట్ అయ్యారు. సెకండ్ రౌండ్ జూమ్ కాల్ అని చెప్పారు. హరీష్ గారి సిద్ధంగా లేని సమయంలో వాళ్ళు జూమ్ కాల్ నిర్వహించారు. 

55
మూడు ప్రశ్నలకు మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం 

అందులో ర్యాండమ్ గా కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు ఇంకెవరికైనా ఎదురైతే ఆన్సర్ చెప్పడానికి తప్పకుండా కాసేపు ఆలోచిస్తారు. కానీ ఈయన మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా ఆన్సర్ ఇచ్చేశారు. ఆ ప్రశ్నలు ఏంటంటే.. చనిపోయిన వారిలో మీకు ఎవరంటే ఇష్టం అని అడిగారు. దీనికి ఆయన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ అని సమాధానం ఇచ్చారు. ఆయన సమాధానం విని నేను షాక్ అయ్యాను. బతికున్న వారిలో ఇష్టమైన వ్యక్తి ఎవరు అని అడిగారు.. దీనికి ఆయన పవన్ కళ్యాణ్ అని సమాధానం ఇచ్చారు. మరో ప్రశ్న ఏంటంటే.. ఇటీవల మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టిన సంఘటన ఏంటి అని అడిగారు. రమ్య అనే చిన్న పాప చనిపోవడం తనని ఎంతో బాధించిందని  ఆయన సమాధానం ఇచ్చినట్లు హరిత పేర్కొంది. 

Read more Photos on
click me!

Recommended Stories