వ్యాపారవేత్తతో పాటు, గౌరీ ఖాన్ సినిమా నిర్మాత కూడా. ఆమె రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థకు సహ-వ్యవస్థాపకురాలుగా ఉన్నారు. ఈ బ్యానర్‌లో ఇప్పటి వరకు 'మై హూ నా', 'ఓం శాంతి ఓం', 'రా వన్', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'మై నేమ్ ఈజ్ ఖాన్', 'బిల్లా', 'హ్యాపీ న్యూ ఇయర్', 'దిల్‌వాలే', 'రయీస్', 'జవాన్', 'డంకీ' వంటి సినిమాలను నిర్మించారు. చాలా వరకు షారూఖ్ ఖాన్ హీరోగానే ఈ మూవీని తెరకెక్కించారు. వాటిలో చాలా వరకు సక్సెస్ కావడం విశేషం.