టాలీవుడ్ లో హీరోగా తన కెరీర్ ని మొదలు పెట్టాడు నటుడు సాయి కిరణ్. నువ్వే కావాలి, ప్రేమించు, మనసుంటే చాలు వంటి సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్నాడు. తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కానీ.. హీరో గా తన కెరీర్ ని కొనసాగించలేకపోయారు. కానీ... కొంత గ్యాప్ తర్వాత... ఆయన బుల్లితెరపై రంగప్రవేశం చేశారు. కోయిలమ్మ, గుప్పెడంత మనసు వంటి సినిమాలతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం పడమటి సంధ్యారాగం అనే సీరియల్ లో తండ్రి పాత్ర చేస్తున్నారు.