దివ్యని విచిత్రమైన రీజన్ తో నామినేట్ చేసిన భరణి, ఇమ్మాన్యుయేల్ ని తప్ప అందరినీ ఇరికించిన బిగ్ బాస్

Published : Nov 10, 2025, 11:13 PM IST

బిగ్ బాస్ తెలుగు 9లో ఈవారం నామినేషన్స్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ ఒక్కరిని తప్ప హౌస్ మొత్తాన్ని నామినేట్ చేశారు. అలా ఎందుకు చేశారో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 64వ రోజు నామినేషన్ల పర్వం విచిత్రంగా సాగింది. ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి హౌస్ లో ఉండకూడదు అని భావించే వారిని నామినేట్ చేయాలి. దానికి కారణాలు చెప్పాలి. నామినేట్ అయిన సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కుర్చీలో కూర్చుంటే బురదనీళ్ళు వాళ్లపై పడతాయి. 

25
గౌరవ్ ని నామినేట్ చేసిన తనూజ 

ఈ ప్రక్రియలో ఒక్కొక్కరూ ఒక్కొక్కరిని నామినేట్ చేస్తూ వచ్చారు. తనూజ.. గౌరవ్ ని నామినేట్ చేసింది. గౌరవ్ కి ఏ విషయంలోనూ క్లారిటీ ఉండడం లేదని ఆరోపించింది. గౌరవ్ కూడా అంటే గట్టిగా తనూజపై రియాక్ట్ అయ్యాడు. తనూజ వాదన అయ్యాక గౌరవ్ బురద నీటిలో తడిచాడు. 

35
విచిత్రమైన రీజన్ తో దివ్యని నామినేట్ చేసిన భరణి 

ఆ తర్వాత భరణి.. దివ్యని నామినేట్ చేశారు. భరణి చేసిన నామినేషన్ చాలా విచిత్రంగా ఉంది. విచిత్రమైన వాదనని భరణి వినిపించేసరికి దివ్య కోపం కట్టలు తెంచుకుంది. అసలు భరణి ఏమన్నారంటే.. నా గేమ్ పాడవ్వడానికి కారణం దివ్య అని హౌస్ లో అందరూ అంటున్నారు. నేను ఎలిమినేట్ కావడానికి కారణం కూడా ఆమెనే అని అంటున్నారు. అది తప్పు అని దివ్య తనని తాను ప్రూవ్ చేసుకోవాలి. 

45
రీతూ అవమానించింది 

ఈ నామినేషన్ ద్వారా దివ్య తనపై వస్తున్న ఆరోపణలు అబద్దం అని ప్రూవ్ చేయాలి అని భరణి అన్నారు. అసలు నావల్ల మీ గేమ్ పాడైందా ? మీరు చెప్పండి ? అది నిజం కాదు అని తెలిసినప్పుడు నన్ను ఎలా నామినేట్ చేస్తారు అంటూ దివ్య భరణిపై విరుచుకుపడింది. ఆ తర్వాత సంజన కూడా గౌరవ్ నే నామినేట్ చేసింది. నిఖిల్.. రీతూ చౌదరిని నామినేట్ చేశారు. రీతూ చౌదరి తాను కెప్టెన్ కాలేనని, తాను వేస్ట్ అంటూ అవమానించింది అని నిఖిల్ ఆరోపించి ఆమెని నామినేట్ చేశారు. 

55
హౌస్ మొత్తం నామినేషన్స్ లో .. ఒక్కరు తప్ప 

 నామినేషన్స్ మొత్తం అయ్యాక బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ వారం నామినేషన్స్ నేను అనుకున్నట్లు జరుగుతాయి. హౌస్ లో ఉన్నవారందరిని నేను నామినేట్ చేస్తున్నా. ఈ వారం ఇంటి సభ్యులు ప్రేక్షకుల నుంచి ఎవరెవరు ఎంత ఓటింగ్ పొందుతారు అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నా. అందుకే అందరినీ నామినేట్ చేస్తున్నా. ఈ నామినేషన్స్ లో కెప్టెన్ కూడా ఉండాలా లేదా అతడికి మినహాయింపు ఇవ్వాలా అనేది ఇంటి సభ్యులు సీక్రెట్ ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. ఆ ఓటింగ్ లో కెప్టెన్ అయిన ఇమ్మాన్యుయేల్ కి అనుకూలంగా హౌస్ మొత్తం ఓట్ చేశారు. ఒక్క భరణి తప్ప. దీనితో నామినేషన్స్ నుంచి ఇమ్మాన్యుయేల్ కి మినహాయింపు లభించింది. సో ఈవారం ఇమ్మాన్యుయేల్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు. 

Read more Photos on
click me!

Recommended Stories