ఈ ముగ్గురిలో చిరంజీవి, ప్రభాస్ సినిమాలని దెబ్బ కొట్టే హీరో ఎవరు.. మహేష్ బాబు పరిస్థితి ఏమైందో చూశారుగా

Published : Nov 10, 2025, 08:13 PM IST

2026 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ ఉండబోతోంది. చిరంజీవి, ప్రభాస్ ఆల్రెడీ సంక్రాంతి బెర్తులు ఖరారు చేసుకున్నారు. మరి కొందరు హీరోలు కూడా తమ సినిమాలతో రెడీ అవుతున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం. 

PREV
15
సంక్రాంతికి పెరుగుతున్న పోటీ

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైనప్పుడు ఒక వివాదం తెరపైకి వస్తుంది. అదే థియేటర్ల సమస్య. స్టార్ హీరోల సినిమాలు ఎక్కువ శాతం థియేటర్లని ఆక్యుపై చేయడం వల్ల చిన్న సినిమాలకు ఇబ్బందులు తప్పవు. కానీ కొన్నిసార్లు ఆ చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద గట్టిగా గర్జిస్తాయి. ఈసారి సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారుతోంది. ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ లో తీవ్రమైన పోటీ ఉంటుంది.

25
రేసులో రవితేజ కూడా.. చిరు, ప్రభాస్ తో బిగ్ ఫైట్

ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్స్ లో సందడి చేసే సీజన్ అది. దీనితో నిర్మాతలు తమ చిత్రాలని సంక్రాంతికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. 2026 సంక్రాంతికి ఇప్పటికే అరడజను పైగా చిత్రాలు బెర్తులు ఖరారు చేసుకున్నాయి. వీటిలో కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు, ప్రభాస్ నటించిన రాజా సాబ్ భారీ చిత్రాలుగా రిలీజ్ కానున్నాయి. వీరిద్దరితో పాటు తాజాగా రవితేజ కూడా సంక్రాంతి బెర్త్ ఖరారు చేసుకున్నారు.

35
టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' గమ్మత్తుగా ఉన్న ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే విధంగా ఉంది. టైటిల్ రివీల్ చేస్తూ సోమవారం టీజర్ కూడా వదిలారు. ఫన్నీగా ఉన్న టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్ రిలీజ్ తోనే సంక్రాంతి రిలీజ్ అని కూడా ఖరారు చేశారు.

45
రెడీ అవుతున్న శర్వానంద్, నవీన్ పోలిశెట్టి

వీటితో పాటు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి లలో చిరంజీవి, ప్రభాస్ సినిమాలని దెబ్బకొట్టే హీరో ఎవరు అంటూ ఆల్రెడీ అభిమానుల మధ్య చర్చ మొదలైంది. ఎందుకంటే చిన్న సినిమాలు అప్పుడప్పుడూ సైలెంట్ గా వచ్చి అగ్ర హీరోల సినిమాలని దెబ్బ కొడుతుంటాయి.

55
తేజ సజ్జాలా దెబ్బ కొట్టేది ఎవరు ?

2024 సంక్రాంతికి ఏమైందో అంతా చూశారు. మహేష్ బాబు గుంటూరు కారం మూవీ భారీ అంచనాలతో విడుదలయింది. అసలు అంచనాలు లేకుండా తేజ సజ్జా హనుమాన్ కూడా సంక్రాంతికి రిలీజ్ అయింది. గుంటూరు కారం మూవీ కలెక్షన్స్ కి హనుమాన్ భారీగా గండి కొట్టింది. ఏకంగా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. అలాంటి సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తెలుగు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నారు. దళపతి విజయ్ జననాయకుడు, శివకార్తికేయన్ పరాశక్తి చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories