మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ఈ పాటని స్టార్ హీరోయిన్ శృతి హాసన్ పాడారు. తన అద్భుతమైన గాత్రంతో శృతి హాసన్ మెస్మరైజ్ చేస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ మూవీ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. నవంబర్ 15న ఈ సినిమాకి సంబంధించిన బిగ్ రివీల్ ఉండబోతోందని ఆల్రెడీ ప్రకటించారు. 100 అడుగుల భారీ ఎల్ఈడీ స్క్రీన్ లో ఈ రివీల్ ఉండబోతోంది. రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వారం మొత్తం గ్లోబ్ ట్రాటర్ చిత్రం నుంచి అప్డేట్స్ ఉంటాయని రాజమౌళి ప్రకటించారు.
25
కుంభ ఫస్ట్ లుక్
చెప్పినట్లుగానే ముందుగా ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నెటిజన్లలో ఈ లుక్ కి సంబంధించిన మిక్స్డ్ రియాక్షన్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీలో కుంభ అనే పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మరో క్రేజీ సర్ప్రైజ్ ని రాజమౌళి ఇచ్చారు.
35
ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో మరో సర్ప్రైజ్ కూడా ఉంది. ఈ పాటని పాడింది ఎవరో కాదు..స్టార్ హీరోయిన్ శృతి హాసన్. శృతి హాసన్ మల్టీట్యాలెంటెడ్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. ఆమెకి మ్యూజిక్ పై మంచి పట్టు ఉంది. గతంలో చాలా సినిమాల్లో పాటలు పాడింది. గ్లోబ్ ట్రాటర్ మూవీలో సంచారి అంటూ సాగే పాటని శృతి హాసన్ పాడింది. తన గాత్రంతో శృతి హాసన్ మెస్మరైజ్ చేస్తోంది.
మహేష్ బాబు వీరత్వాన్ని వర్ణిస్తూ ఈ పాటని రాశారు. ఈ పాటకి చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజూ పరుగే లే.. వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగే లే, రారా వీరా ధృవ తారా సంచారా అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
55
పూనకం వచ్చినట్లు పాడిన శృతి హాసన్
శృతి హాసన్ లీనమైపోయి పూనకం వచ్చినట్లు ఈ పాటని పాడుతోంది. ఆ దృశ్యాలు లిరికల్ వీడియోలో ఉన్నాయి. ఈ మూవీలొ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని 1000 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.