పదో వారం నామినేషన్‌ లిస్ట్.. భరణి, దివ్యలకు చుక్కలు.. వారిలో ఒక వికెట్‌ ఔట్‌

Published : Nov 10, 2025, 01:44 PM IST

Bigg Boss Telugu 9: బిగ్‌ బాస్‌ తెలుగు 9 పదో వారం నామినేషన్‌ లిస్ట్ వచ్చింది. ఈ వారం అదిరిపోయే కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు. వారిలో ఒకరు మాత్రం గ్యారంటీగా ఔట్‌. 

PREV
14
పదో వారం నామినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9 పదో వారం రణరంగం స్టార్ట్ అయ్యింది. తొమ్మిదో వారంలో ఇద్దరు ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. రాము రాథోడ్‌ సెల్ఫ్‌ ఎలిమినేషన్‌ చేసుకోగా, ఆదివారం రెగ్యూలర్‌ ఎలిమినేషన్‌లో శ్రీనివాస సాయి ఎలిమినేట్‌ అయ్యారు. దీంతో ప్రస్తుతం హౌజ్‌లో 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. భరణి, సంజనా ఎలిమినేట్‌ అయి మళ్లీ హౌజ్‌లోకి వచ్చారు. వీరితోపాటు ఇమ్మాన్యూయెల్‌, తనూజ, కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌, రీతూ చౌదరీ, సుమన్‌ శెట్టి, గౌరవ్‌, నిఖిల్‌, దివ్య హౌజ్‌లో ఉన్నారు. సోమవారం వచ్చిందంటే నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ వాడివేడిగా సాగుతుంది.

24
భరణికి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయెల్‌

తాజాగా పదో వారం నామినేషన్‌ లిస్ట్ వచ్చింది. ఈ వారం ఆరుగురు నామినేట్‌ అయినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా భరణి మరోసారి నామినేట్ అయ్యారు. ఆయనతోపాటు దివ్య నామినేట్‌ అయ్యింది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన నిఖిల్‌, గౌరవ్‌లు కూడా నామినేషన్‌లో ఉన్నారు. వీరితోపాటు సంజనా నామినేట్‌ అయ్యింది. ఇంత కాలం నిఖిల్‌, గౌరవ్‌ నామినేషన్‌ ని తప్పించుకుంటూ వచ్చారు. ఈ సారి వాళ్లు నామినేషన్‌లో ఉండటంతో ఆసక్తికరంగా మారింది. ఇమ్మాన్యుయెల్‌ భరణిని నామినేట్‌ చేశాడు. మీరు నామినేషన్‌ విషయంలో వెనకాడుతున్నారని, ఇకపై తన ఫైర్ చూపిస్తానని మళ్లీ వచ్చారు, కానీ మళ్లీ డౌన్‌ అవుతున్నారని చెప్పి నామినేట్‌ చేశారు ఇమ్మాన్యుయెల్‌.

34
దివ్యని ఆడుకున్న రీతూ చౌదరీ

ఇక దివ్యని నామినేట్‌ చేస్తూ ఇద్దరు ముగ్గురుని పెట్టుకుని వారిని గ్యాంగ్‌లాగా ఉంచుకుంటావని రీతూ కామెంట్‌ చేసింది.  ఒక్కో పాయింట్‌ చెప్పి వాళ్లని బాణాలు వదిలినట్టు వదులుతావు అంటూ రీతూ చెప్పగా, వాళ్లేమైనా చిన్న పిల్లలా, నేను ఔట్‌ అయిన తర్వాతనే ఎవరికైనా సపోర్ట్ చేస్తానని చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక సంజనాని నామినేట్‌ చేస్తూ నువ్వు ఎమోషనల్‌ డ్రామా ఆడుతున్నావంటూ కామెంట్‌ చేశాడు గౌరవ్‌. పర్‌ఫెర్మెన్స్ ఏం లేదని, నువ్వొక సెల్ఫీష్‌ ప్లేయర్ అంటూ కామెంట్‌ చేశాడు.

44
పదో వారం నామినేషన్స్ లిస్ట్

మరోవైపు నిఖిల్‌ని కళ్యాణ్‌ నామినేట్‌ చేశారు. ఆట బాగా లేదని, ఇంకా ఆడాలని తెలిపారు. ఇప్పుడు భరణితోపాటు కొందరు తనకంటే డౌన్‌లోనే ఉన్నారని, నెక్ట్స్ టాప్‌ 5లోకి వస్తానని చెప్పాడు నిఖిల్‌. అదే చూపించమని కళ్యాణ్‌ అన్నారు. ఇలా దివ్యని భరణి, రీతూ.. నిఖిల్‌ని సుమన్‌, కళ్యాణ్‌.. గౌరవ్‌ని తనూజ, సంజనా, పవన్‌లు, సంజనాని గౌరవ్‌.. రీతూని నిఖిల్‌ నామినేషన్‌ చేశారు. పదో వారం దివ్య, భరణి, నిఖిల్‌, గౌరవ్‌, రీతూ, సంజనా నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో నిఖిల్‌, గౌరవ్‌, భరణిల మధ్య ఎలిమినేషన్‌ ఉండే అవకాశం ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories