మెగాస్టార్ చిరంజీవిని ఓ రేంజ్ లో చూస్తారు ఫ్యాన్స్. డీ గ్లామర్ పాత్రలో చిరుని ఊహించుకోవడం కూడా ఇష్టం ఉండదు. కానీ చిరంజీవి తన కెరీర్ లో స్టార్ ఇమేజ్ ను కూడా పక్కన పెట్టి, పనివాడిగా చేసిన సినిమా ఏదో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. జీరో స్థాయి నుంచి మెగాస్టార్ గా ఎదుగుతూ.. తనకంటూ ప్రత్యేకమైన మెగా సామ్రాజ్యాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో స్థాపించాడు చిరంజీవి. ఒక్కడుగా ఇండస్ట్రీకి వచ్చి.. టాలీవుడ్ ను ఏలే స్థాయికి ఎదిగాడు మెగాస్టార్. ఈక్రమంలో ఎన్నో ఆటు పోట్లు, ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు మెగా హీరో. హిట్ వచ్చినప్పుడు పొంగిపోలేదు.. డిజాస్టర్ పడినప్పుడు కుంగిపోలేదు. ఎప్పటికప్పుడు అద్భతమైన కథలను సెలక్ట్ చేసుకుంటూ..మంచి మంచి సినిమాలతో దూసుకుపోయాడు చిరంజీవి.
26
చిరంజీవి ఎంతో ఇష్టంగా చేసిన సినిమా?
ఆయన కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలతో పాటు, డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. కొన్ని సినిమాలు చూడటానికి మంచిగా అనిపించినా.. అవి యావరేజ్ గా, ప్లాప్ టాక్ తచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈక్రమంలో తన సినమాల్లో ఓ సినిమా గురించి చిరంజీవి ఓ సందర్భంలో ప్రత్యేకంగా ప్రస్తావించరు. ఆసినిమా మరేదో కాదు స్నేహం కోసం. ఈసినిమాను ఎంతో ఇష్టంతో చేసినా కానీ.. అనుకున్నంత రెస్పాన్స్ మాత్రం రాలేదు. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. అయితే ఈమూవీలో చిరంజీవి చేసిన పాత్రను ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. కారణం ఏంటి?
36
డ్యూయల్ రోల్ చేసిన చిరంజీవి
మెగాస్టార్ ఇమేజ్ వేరు. ఆయన సినిమాల్లో డీ గ్లామర్ రోల్ చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకునేవారు కాదు. అందుకే చిరంజీవి ఎక్కువగా యాక్షన్, డాన్స్, సెంటిమెంట్ కలగలిపి ఉన్న కథలను ఎంచుకుని మరీ సినిమాలు చేసేవారు. డీ గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేసింది లేదు. కానీ ఆయన కెరీర్ లో ఒక్క సారి మాత్రం.. తన స్టార్ ఇమేజ్ ను కాస్త పక్కన పెట్టి ఓ సినిమాలో మాత్రం, పనివాడిగా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ముందు చేతులు కట్టుకుని నిలబడే పాత్రలో కనిపించారు. ఆసినిమా మరేదో కాదు స్నేహం కోసం. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేశారు. తండ్రీ కొడుకులుగా మెగాస్టార్ నటన అద్భుతం. కానీ ఆయన క్యారెక్టరైజేషన్ మాత్రం ఫ్యాన్స్ కు రుచించలేదు.
స్నేహం కోసం సినిమాలో తండ్రి, కొడుకు గా చిరంజీవి.. విజయ్ కుమార్ ముందు చేతులు కట్టుకునిమ నిలబడి ఉంటాడు. ఆ ఇంట్లో పనిచేసుకుంటూ.. ఆ జమిందారు కుటుంబం కోసమే బ్రతుకుతుంటారు. చిరంజీవి కెరీర్ లో ఇలాంటి పాత్ర చేసింది లేదు. మొదటిసారి చిరంజీవి ఇలాంటి సినిమాను ట్రై చేశారు. తమిళ దర్శకుడు కే ఎస్ రవికుమార్ తెరెక్కించిన ఈసినిమాలో తమిళ వాసనలు ఎక్కువగా కనిపించాయి. పైగా క్లైమాక్స్ లో చిరంజీవి పాత్ర మరణించడం కూడా ఆడియన్స్ కు నచ్చలేదు. కానీ కొంత మంది మాత్రం ఈసినిమాకు వీరాభిమానులు ఉన్నారు. ఈసినిమా గురించి డైరెక్టర్లతో కలిసి చేసిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి వెల్లడించారు.
56
చిరంజీవి మాట్లాడుతూ..
‘’స్నేహం కోసం సినిమా కే ఎస్ రవికుమార్ చెప్పిప్పుడు చాలా బాగా అనిపించింది. కానీ అందులో నేను చేతులు కట్టుకుని విజయ్ కుమార్ ముందు ఉండటం..జనాలు యాక్సెప్ట్ చేస్తారా అని అడిగాను.. కానీ చాలా బాగుంటుంది... మంచి ఎమోషనల్ కంటెంట్ అని అన్నారు. నేను కూడా చాలా ఇష్టంతో ఈసినిమాను చేశాను. డ్యూయల్ రోల్, హెవీ సెంటిమెంట్ ఉన్న కథ. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. కానీ నేను అలా నటించడం ఫ్యాన్స్ కు నచ్చలేదో ఏమో.. ఆసినిమా యావరేజ్ గా నిలిచింది''. అన్నారు మెగాస్టార్.
66
బాలకృష్ణ సినిమా వల్ల
నిజానికి స్నేహం కోసం సినిమా ప్లాప్ అవ్వడానికి మరో కారణం కూడా ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన టైమ్ లోనే బాలకృష్ణ సమరసింహారెడ్డి వచ్చింది. ఫ్యాక్షన్ యాక్షన్ కంటెంట్ తో.. ఆడియన్స్ ను ఊర్రూతలూగించింది మూవీ. దాంతో స్నేహం కోసం సినిమాపై సమరసింహారెడ్డి ప్రభావం గట్టిగా పడింది. బాలయ్య సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. స్నేహం కోసం యావరేజ్ గా నిలిచింది.