తన ఇమేజ్‌కి సెట్‌ కాదని రిజెక్ట్ చేసిన కృష్ణంరాజు.. ఇండస్ట్రీ హిట్‌ కొట్టి చూపించిన విశ్వనాథ్‌, ఆ సినిమా ఇదే

Published : Nov 10, 2025, 12:43 PM IST

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు ఒకప్పుడు స్టార్‌గా రాణించారు. ఆ సమయంలో ఓ కల్ట్ క్లాసిక్‌ మూవీని రిజెక్ట్ చేశారు. దీంతో ఆ చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్‌ చేసి చూపించారు దర్శకుడు కళాతపస్వి విశ్వనాథ్‌. 

PREV
15
ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లకు ధీటుగా ఎదిగిన కృష్ణంరాజు

రెబల్‌ స్టార్ కృష్ణంరాజు తెలుగు దిగ్గజాల్లో ఒకరు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల తర్వాత ఆ స్థాయి ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. యాక్షన్‌ సినిమాలతో ఎక్కువగా మెప్పించారు. రెబల్‌ పాత్రలు పోషించి రెబల్‌ స్టార్‌గా పేరుతెచ్చుకున్నారు. కృష్ణంరాజు యాక్షన్‌ చిత్రాలు చేస్తూనే కొన్ని మహిళా ప్రధానమైన చిత్రాలు కూడా చేశారు. మహిళల గొప్పతనం చెప్పే ప్రయత్నం చేశారు. రెబల్‌ స్టార్‌ ఇమేజ్‌ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరించే ప్రయత్నం చేశారు.

25
1970-80లో స్టార్‌గా కృష్ణంరాజు కెరీర్‌ పీక్‌

కృష్ణంరాజు `చిలక గోరింక` చిత్రంతో నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత అనేక సూపర్‌ హిట్‌ చిత్రాలు చేశారు. విలన్‌గానూ చేసి నిరూపించుకున్నారు. విలన్‌ నుంచి హీరో అయ్యారు. విభిన్నమైన పాత్రలతో మెప్పించారు. అయితే ఓ కల్ట్ క్లాసిక్‌ మూవీని కృష్ణంరాజు రిజెక్ట్ చేశారు. 1967 నటుడిగా కెరీర్‌ని ప్రారంభించిన కృష్ణంరాజు 70-80లో స్టార్‌గా రాణించారు. ఆ టైమ్‌లో హీరోగా ఆయన కెరీర్‌ పీక్‌లో ఉంది. తిరుగులేని సూపర్‌ స్టార్‌గా రాణించారు. అలాంటి సమయంలో ఒక క్లాసిక్‌ మూవీని వదులుకున్నారు కృష్ణంరాజు. దర్శకుడు విశ్వనాథ్‌తో సినిమాని రిజెక్ట్‌ చేశారు.

35
తెలుగు చిత్ర పరిశ్రమలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన `శంకరాభరణం`

1980లో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీ `శంకరాభరణం`. కేవలం పాటలు, ఎమోషన్స్ ప్రధానంగా నడిచే చిత్రమది. ఓ పెద్ద వయస్కుడు సంగీతం గొప్పతనం చెప్పే ప్రయత్నం చేయడం, ఫారెన్‌ మ్యూజిక్‌ ప్రపంచాన్ని శాసిస్తున్న సమయంలో మన సాంప్రదాయ సంగీతం గొప్పతనం చాటి చెప్పిన సినిమా ఇది. సినిమానే కాదు, సినిమాలో కథ కూడా అదే. ఈ చిత్రం 1980 ఫిబ్రవరి 2న విడుదలైంది. అయితే అప్పుడు సినిమాని విడుదల చేసేందుకు కూడా ఎవరు ముందుకు రాలేదు. విడుదలైన వారం వరకు జనం సినిమాని పట్టించుకోలేదు. నెమ్మదిగా పుంజుకుంది. ప్రభంజనం సృష్టించింది. ఎంత కలెక్ట్ చేసింది? ఎన్ని లాభాలు వచ్చాయనేది పక్కన పెడితే, తెలుగు సినిమాల్లో ఇదొక కల్ట్ క్లాసిక్‌ గా నిలిచిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో వచ్చిన బెస్ట్ మూవీస్‌ లో ఇది ఒకటిగా నిలుస్తుంది.

45
శంకరాభరణం మూవీని రిజెక్ట్ చేసిన రెబల్‌ స్టార్‌

ఈ సినిమాలో హీరో పాత్రని క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ అయిన సోమయాజులు చేశారు. అదరగొట్టారు. కానీ మొదట ఆ పాత్రకి కృష్ణంరాజుని అనుకున్నారు కళాతపస్వి విశ్వనాథ్‌. వారికంటే ముందు ఏఎన్నార్‌, జెమినీ గణేషన్‌ లను అనుకున్నారు. కానీ వారికి కథ చెప్పలేదు. ఆ తర్వాత కృష్ణంరాజు ని కలిసి కథ నెరేట్‌ చేశారు. ఆయనకు ఈ కథ బాగా నచ్చింది. కానీ అప్పుడు తనకున్న మాస్‌ ఇమేజ్‌కి ఇది సెట్‌ కాదన్నారట. ఎలాంటి ఇమేజ్‌ లేని నటుడు చేస్తే బాగుంటుందని ఆయన భావించారు. అందుకే ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. దీంతో ఆ తర్వాత సోమయాజులుని తీసుకున్నారు. ఆయన అంతే బాగా చేసి మెప్పించారు. సినిమా కూడా సంచలన విజయం సాధించింది. ఈ మూవీని ఆడియెన్స్ ఒక సెలబ్రేషన్‌లా భావించారు. చాలా చోట్ల ప్రింట్లు తెప్పించుకుని సినిమాని చూశారట. అంతేకాదు చాలా చోట్ల దర్శకుడు విశ్వనాథ్‌ని పిలిపించి సత్కరించారట. ఇలా ఆయన ఎన్ని సత్కారాలు అందుకున్నారో లెక్కే లేదు.

55
కృష్ణంరాజు నిర్ణయమే కరెక్ట్

అలా కృష్ణంరాజు `శంకరాభరణం` వదులుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన చెప్పిందే కరెక్ట్ అని అంతా భావించారు. కృష్ణంరాజు చేస్తే ఈ రేంజ్‌లో ఆకట్టుకునేది కాదని, ఆడియెన్స్ డిజప్పాయింట్‌ అయ్యేవారని మాట్లాడుకున్నారట. ఏదేమైనా కృష్ణంరాజు రిజెక్ట్ చేస్తే, దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇండస్ట్రీ హిట్‌ కొట్టి చూపించారు విశ్వనాథ్‌. ఇప్పటికీ ఈ సినిమా గురించి జనం మాట్లాడుకుంటారని చెబితే అతిశయోక్తి లేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories